Game Changer రిలీజ్ డేట్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. వచ్చేది అప్పుడే అంటూ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో తండ్రి కొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రలలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. అలాగే భిన్నమైన నేపధ్యాలలో మూవీ కథ ఉండబోతుంది.
ఇదిలా ఉంటే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు. ఇక ఫస్ట్ లుక్ రామ్ చరణ్ స్టైలిష్ గా కనిపించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే ఇండియన్ 2 సంక్రాంతికి రిలీజ్ చేస్తే డిసెంబర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వొచ్చు అనే ప్రచారం నడుస్తుంది.

అయితే తాజాగా దిల్ రాజు గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఈ మూవీ రిలీజ్ పై వస్తున్న వార్తలు అన్ని కేవలం రూమర్స్ మాత్రమే అని తేల్చేశారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా చాలా ఉందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ మొత్తం ఆగష్టు నాటికి కంప్లీట్ అవుతుందని తెలిపారు. కొన్ని యాక్షన్స్ సీక్వెన్స్, టాకీ పార్ట్, అలాగే సాంగ్స్ షూట్ చేయాల్సి ఉందని చెప్పారు.
ఆగష్టు, సెప్టెంబర్ నాటికి కంప్లీట్ గా షూటింగ్ ప్యాకప్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఆ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ గురించి ఆలోచిస్తాం అని దిల్ రాజు స్పష్టం చేశారు. డిసెంబర్, జనవరి నెలలలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. దీనిని బట్టి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ వచ్చే ఏడాది వేసవిలోనే ఉండే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తుంది. ఇక సెప్టెంబర్ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని టాక్.


Click it and Unblock the Notifications











