ఆ సినిమాల కలెక్షన్లు అంతా ఫేక్.. తప్పుడు లెక్కల్ని బయటపెట్టిన దిల్ రాజు
తెలుగు సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వ్యవహారం ఇటీవల కాలంలో వివాదాస్పదంగా మారాయి. వాస్తవ వసూళ్లను మార్పు చేసి.. హీరోల క్రేజ్‌ను పెంచడానికి కలెక్షన్ల పెంచి అంకెలు చెబుతున్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. అయితే నిర్మాతలు, సినిమా యూనిట్ చెబుతున్న లెక్కల్లో వాస్తవం లేదు అని దిల్ రాజు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డిస్టిబ్యూటర్లు, నిర్మాతలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను దిల్ రాజ్ వెల్లడిస్తూ..

నిర్మాత డిమాండ్ మేరకే
కరోనా లాక్‌డౌన్‌లో సినిమాలు రెండున్నర ఏళ్లు ఆగిపోయాయి. దాంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. దాంతో RRR టికెట్లు పెంచడంతో అందరూ దాన్ని ఫాలో అయ్యారు. నిర్మాత ఎంత డిమాండ్ చేస్తే.. డిస్టిబ్యూటర్లు దానికి తలవొగ్గుతున్నారు. నిర్మాత డిమాండ్లను డిస్టిబ్యూటర్లు ఒప్పుకోవడం తప్పు అనేది నా అభిప్రాయం. వాళ్లు ఒప్పుకోకపోతే టికెట్ల రేట్లు పెరగవు. బిజినెస్ ఎక్కువ మొత్తానికి జరుగదు.

డిస్టిబ్యూటర్లదే తప్పు అంటూ
ఒక హీరో సినిమా ఓ మొత్తం కలెక్షన్లు రాబడితే.. ఆ మొత్తాన్ని మరో సినిమాకు కోట్ చేస్తున్నారు. ఏ నిర్మాతైనా డిస్టిబ్యూటర్ నుంచి ఎక్కువ రాబట్టాలని కోరుకొంటాడు. నిర్మాత చెప్పిన డిస్టిబ్యూటర్లు ఒప్పుకోవడమా లేదా అనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఎంత వస్తుంది? హిట్ ఎంత వస్తుందని డిస్టిబ్యూటర్ బేరిజు వేసుకోవాలి. ఈ వ్యవహారంలో డిస్టిబ్యూటర్లదే తప్పు అనేది నా అభిప్రాయం అని దిల్ రాజు చెప్పారు.

తొలి రోజు కలెక్షన్లు వేరియన్ గురించి
నైజాంలో మొత్తం 450 థియేటర్లు ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇప్పటి వరకు RRR సినిమా థియేటర్లలో రిలీజైంది. RRR సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది. కేజీఎఫ్ 250 థియేటర్లకుపైగా రిలీజైంది. పెద్ద హీరోల సినిమాలు నైజాంలో 300 నుంచి 350 థియేటర్లలో రిలీజవుతాయి. కాబట్టి తొలి రోజు కలెక్షన్లు రకరకాలుగా ఉంటాయి. ఓ సినిమాకు మరో సినిమాకు మారుతాయి అని దిల్ రాజు అన్నారు.

నిర్మాతలు కలెక్షన్లు మార్చేసి..
పెద్ద హీరోల సినిమాలకు సంబంధించిన సినిమాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తే నేను కేవలం లెక్కలు మాత్రమే నిర్మాతకు ఇస్తాను. కానీ వారు అసలు లెక్కలు చెప్పకుండా వసూళ్లను మార్చి బయటకు రిలీజ్ చేస్తుంటారు. కలెక్షన్లు బయటకు చెప్పడం డిస్టిబ్యూటర్ల చేతిలో ఉండదు. మేము కేవలం నంబర్లు మాత్రమే చెబుతాం. నిర్మాతలు తమకు ఇష్టం వచ్చినట్టు మార్చుకొని.. తమకు నచ్చిన విధంగా కలెక్షన్లు బయటకు వెల్లడిస్తున్నారు అని దిల్ రాజు చెప్పాడు.

టాలీవుడ్‌లో ఆ పరిస్థితి మారాలి అంటూ
సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు తప్పుగా చెప్పడం త్వరలోనే ఆగిపోతాయి. యూఎస్‌లో రన్ ట్రాక్ ఉంది. బాలీవుడ్‌లో నికర వసూళ్లను వెల్లడిస్తున్నారు. తెలుగు స్టేట్స్‌లో కలెక్షన్లలో హైర్స్, షేర్ గ్యారెంటీలను మొదటి రోజు కలెక్షన్లలో కలుపుతున్నారు. పెద్ద హీరోల సినిమాలకు వెల్లడించే కలెక్షన్లు కరెక్ట్ కాదు. హైర్స్ కలిపి చెబితే అది షేర్ కాదు. ఇలాంటి పరిస్థితి త్వరలోనే మారిపోతాయి. రాజమౌళి కలెక్షన్ల గురించి అడగరు. ఒక రోజు ఎంత మంది సినిమా చూశారని అడుగుతారు అని దిల్ రాజు చెప్పారు.

శంకర్ సినిమా బడ్జెట్ గురించి
సినిమా బడ్జెట్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నిర్మాతపై ఉంటుంది. బడ్జెట్ కంట్రోల్ తప్పిందంటే నిర్మాతదే తప్పు. కరోనా లాంటి, ఇతర పరిస్థితుల్లో బడ్జెట్ పెరగడమనేది సర్వసాధారణం. కొందరు నిర్మాతలు సినిమా తీయాలనుకొంటారు. కానీ వారికి బడ్జెట్ మీద నియంత్రణ ఉండదు. శంకర్‌తో సినిమా తీస్తున్నప్పుడు కూడా బడ్జెట్ గురించి స్పష్టంగా చర్చించాం. బడ్జెట్‌ను పక్కాగా డిసైడ్ చేశాం. ప్రతీ నిర్మాత సినిమా తీసేటప్పుడు బడ్జెట్‌పై క్లారిటీ ఉండాలి అని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











