Pushpa 2 Stampade: పుష్ప2 తొక్కిసలాట బాలుడి పరిస్థితి దయనీయంగా? అల్లు అర్జున్ పట్టించుకోవడం లేదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2024 సంవత్సరం డిసెంబర్ 4వ గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లోని జరిగిన తొక్కిసలాటి ఓ యువతి మరణానికి, మరో బాలుడికి తీవ్ర గాయాల పాలయ్యేలా చేసింది. అయితే ఏడాది తర్వాత కూడా బాధితుడు శ్రీతేజ్ పరిస్థితి దయనీయంగా మారడమే కాకుండా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆర్థిక సహాయం కోసం అల్లు అర్జున్ టీమ్‌ను సంప్రదించగా పట్టించుకోవడం లేదు. వారి నుంచి సరైన స్పందన రావడం లేదు అనే విషయం మీడియాలో జోరుగా ప్రచారమవుతున్నది. ఈ క్రమంలో అల్లు అర్జున్ స్నేహితుడు, నిర్మాత బన్నీ వాస్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ వివాదంపై స్పందించారు. అసలు శ్రీతేజ్ విషయంలో ఏం జరుగుతున్నదనే వివరాల్లోకి వెళితే..
డిసెంబర్ 4వ తేదీన జరిగిన పుష్ప 2 ప్రీమియర్ల సందర్భంగా భారీగా అభిమానులు, ప్రేక్షకులతో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా జనాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు జరిపిన లాఠీఛార్జి సందర్భంగా భారీ తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా సినిమాను చూసేందుకు తన భర్త భాస్కర్, కుమారుడు శ్రీతేజ్‌తో కలిసి రేవతి అనే యువతి వచ్చింది. ఈ తొక్కిసలాటలో రేవతి తీవ్రంగా గాయపడటం.. ఆమెను హాస్పిటల్‌కు తరలిస్తుండగా మరణించారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లి కిమ్స్ హాస్పిటల్‌లో 146 రోజలకుపైగా చికిత్స పొందాడు. ఆ తర్వాత డిశ్చార్జి అయ్యాడు.

అయితే ప్రస్తుతం శ్రీతేజ్ వైద్యానికి సుమారుగా లక్షకుపైగానే ఖర్చు అవుతుంది. ఇటీవల బాలుడి కాలి సర్జరీకి 3 లక్షల రూపాయలు ఖర్చు అయిందని తండ్రి భాస్కర్ తెలిపాడు. అయితే ఇటీవల తనకు అదనంగా ఖర్చుల కోసం కొంత చెల్లించాలని ప్రయత్నిస్తే.. అల్లు అర్జున్ టీమ్ నుంచి సరైన స్పందన రాలేదు అని చెప్పడం వివాదంగా మారింది.
శ్రీతేజ్ వివాదం గురించి బన్నీ వాసును మీడియా క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నించగా.. ఈ వివాదంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు, దిల్ రాజు ఉన్నారు. అటు నుంచి ఏదైనా సమస్య వచ్చినా.. ఇటు నుంచి ఏదైనా కన్సర్న్ ఉన్నా పెద్ద వాళ్లే చూసుకొంటున్నారు. ఈ విషయంలో శ్రీతేజ్‌కు సరైన సహకారం అందిస్తున్నామా? లేదా? అనే విషయానికి వస్తే.. బాలుడికి వైద్యానికి ఎంత ఖర్చు పెట్టాలి? వారి జీవన భృతికి ఎంత ఖర్చు పెట్టాలనే విషయంలో కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. వారికి డబ్బు సరిపోవడం లేదంటే.. మధ్యలో ఉన్న పెద్ద వారు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఈ వివాదం గురించి చర్చించడానికి ఇది సరైన వేదిక కాదు అని బన్నీ వాసు అన్నారు.
శ్రీతేజ్ వైద్యం కోసం మరో ఆరు నెలలు హాస్పిటల్‌లో ఉంచి ఫిజియోథెరపీ నిర్వహించాలి. అందుకు కొంత ఖర్చు అవుతుంది అని తండ్రి భాస్కర్ అంటే.. ఆరు నెలలు కాదు.. అవసరమైతే ఏడాదిపాటు ఫిజియోథెరపీ అందించి నయం అయ్యేలా చేద్దాం. వాళ్లు (అల్లు అర్జున్) ఇంత చేసిన తర్వాత ఈ మాత్రం చేయకుండా వెనుకాడరు. కాబట్టి ఈ విషయంలో అదైర్య పడకుండా వైద్యం చేయించండి. ఆ బాధ్యత నాదే అని దిల్ రాజు బాధితుడిని భుజం తట్టి ధైర్యం చెప్పారు. దాంతో అల్లు అర్జున్ పట్టించుకోవడం లేదనే వాదనలు, ఆరోపణలకు దిల్ రాజు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
డిశ్చార్జి సమయంలో శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ ఫ్యామిలీ 2 కోట్ల రూపాయల ఫండ్‌ను డిపాజిట్ చేశారు. దాని ద్వారా 75 వేల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తున్నది. దాని ద్వారా వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. హాస్పిటల్‌లో అయిన 75 లక్షల రూపాయలు కూడా అల్లు అర్జున్ చెల్లించారు. ప్రస్తుతం అదనంగా ఖర్చు అవుతున్నది. ఆ విషయం గురించి అల్లు అర్జున్, అరవింద్‌తో మాట్లాడి ఆ మొత్తాన్ని సమకూర్చేలా చేస్తాను అని దిల్ రాజు అన్నారు.


Click it and Unblock the Notifications











