Vakeel Saab.. 50 రోజుల తర్వాతే వకీల్ సాబ్.. రూమర్లకు తెర దించిన దిల్ రాజు
వకీల్ సాబ్ సినిమాపై రకరకాల దుష్ర్పచారాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ దిల్ రాజ్ వీడియోను రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా వకీల్ సాబ్‌ను ఆదరించిన ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాపై వస్తున్న రూమర్లపై స్పందిస్తూ..

పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు
తెలుగు వారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా వకీల్ సాబ్‌ను ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. మా వకీల్ సాబ్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నదనే రూమర్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. కానీ అందులో వాస్తవం లేదు అని దిల్ రాజు స్పష్టీకరించారు.

50 రోజుల తర్వాతే అంటూ
తెలుగు సినిమా, స్టార్ హీరో సినిమా ఏదైనా 50 రోజులల తర్వాతే ఓటీటీలో వస్తుంది. అలాగే 50 రోజుల తర్వాతే వకీల్ సాబ్ ఓటీటీలో వస్తుంది. ఒక పెద్ద సినిమా వల్ల కలిగే థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ చిన్న ఫోన్లలో, టీవీల్లో రాదు. కాబట్టి థియేటర్‌లోనే చూడండి అని దిల్ రాజు కోరారు.

థియేటర్‌లోనే చూడండి
వకీల్ సాబ్ సినిమా విషయంలో తెలుగు ప్రేక్షకులను కోరుకొనేది ఒకటే. ఇంత మంచి సినిమా అని అభినందిస్తున్న మీ అందరూ వీలైనంతగా థియేటర్‌లోనే చూడండి. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో మాస్కులు వేసుకొని థియేటర్‌కు రండి. థియేటర్లలో సరైనా జాగ్రత్తలు తీసుకొంటున్నాం అని దిల్ రాజు పేర్కొన్నారు.
నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ
వకీల్ సాబ్‌ను మీ సినిమాగా భావించి పెద్ద హిట్ చేసిన అభిమానులకు, మహిళలకు, అమ్మాయిలకు, ఫ్యామిలీస్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్. కమర్షియల్‌గానే కాకుండా ఎంతో మంచి సినిమా అని ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ స్పూర్తిని తీసుకొని రానున్న మా సినిమాలకు వకీల్ సాబ్‌ను ఓ ఇన్సిపిరేషన్‌గా దోహదపడుతుంది అని దిల్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











