#Thalapathy66 20 ఏళ్లలో ఇలాంటి కథ వినలేదు.. దిల్ రాజ్‌కు విజయ్ ప్రశంసలు.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో డిస్టిబ్యూటర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టిన దిల్ రాజు విభిన్నమైన కథలు, విలక్షణమైన చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్నారు. పరాజయాలను పాసింగ్ క్లౌడ్స్‌గా మార్చుకొని వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొంటున్నారు. తన పరిధి టాలీవుడ్‌కే పరిమితం కాదని ప్యాన్ ఇండియా సినిమాలతో కేక పెట్టించబోతున్నారు. అయితే ప్రస్తుత ఏడాదితోపాటు 2023లో తన క్యాలెండర్ గురించి దిల్ రాజు వెల్లడిస్తూ..

 సంక్రాంతి పండుగ ఫేవరేట్‌గా

సంక్రాంతి పండుగ ఫేవరేట్‌గా

సంక్రాంతి పండుగ వస్తే హిట్ ఖాతాలో వేసుకోవాలనే తపన దిల్ రాజులో కనిపిస్తుంది. సంక్రాంతి బరిలో ఎవడు, శతమానం భవతి, సరిలేరు నీకెవ్వరు నుంచి రౌడీ బాయ్స్ వరకు విజయాలను అందుకొన్నారు. 2023 సంక్రాంతికి కూడా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన సినిమాల ప్లానింగ్ గురించి పక్కాగా ఉన్నట్టు తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు వెల్లడించారు.

Thalapathy66 స్టోరి బ్యూటీఫుల్‌గా

Thalapathy66 స్టోరి బ్యూటీఫుల్‌గా

తమిళ సూపర్ స్టార్ విజయ్‌తో వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నాం. విజయ్‌కు వంశీ చెప్పిన స్టోరి బ్యూటీఫుల్‌గా ఉంటుంది. వంశీ లైన్ చెప్పినప్పుడే మేము మళ్లీ బెస్ట్ సినిమా చేయబోతున్నామనే ఫీలింగ్ కలిగింది. మా బ్యానర్, వంశీకి, విజయ్‌ కెరీర్‌లో బెస్ట్ అవుతుంది. కరోనావైరస్ కారణంగా షూటింగ్ లేట్ అవుతుంది. లేకపోతే ఇప్పటికే షూట్ మొదలుపెట్టాల్సింది. పరిస్థితులన్నీ చక్కబడితే త్వరలోనే షూట్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం అని దిల్ రాజు చెప్పారు.

 స్టార్ హీరో ప్రశంస గ్రేట్

స్టార్ హీరో ప్రశంస గ్రేట్

దళపతి విజయ్ కెరీర్‌లో 66వ చిత్రంగా మా బ్యానర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌ రాబోతున్నది. వంశీ పైడిపల్లి కథ చెప్పగానే విజయ్ థ్రిల్ అయ్యాడు. నా కెరీర్‌లో గత 20 ఏళ్లలో ఇలాంటి కథ వినలేదని చెప్పాడు. ఒక స్టార్ హీరో నుంచి అలాంటి అప్రిషియేషన్ రావడం మాకు మరింత ఉత్సాహాన్ని అందించింది. ఇంకా కథ‌పై కసరత్తు జరుగుతున్నది. చాలా గ్రేట్ ఫీలింగ్ కలుగుతున్నది అని దిల్ రాజు చెప్పారు.

దీపావళికి విజయ్.. సంక్రాంతికి రాంచరణ్

దీపావళికి విజయ్.. సంక్రాంతికి రాంచరణ్

కరోనావైరస్ పరిస్థితులన్నీ అదుపులోకి వస్తే మార్చిలో షూటింగ్ ప్రారంభించాలని అనుకొంటున్నాం. వంశీ టీమ్ స్క్రిప్టుపై పనిచేస్తున్నది. 2022లో విజయ్‌తో, రాంచరణ్‌తో సినిమాలు పూర్తవుతాయి. విజయ్ సినిమాను దీపావళీ 2022కి, రాంచరణ్ సినిమాను సంక్రాంతి 2023కి రిలీజ్ చేస్తాం. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సంక్రాంతికి ఓ సినిమాను రిలీజ్ చేయడం గ్యారంటీ అని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.

Recommended Video

How Dil Raju Deal With His Flops ? RC 15 Producer Inspirational Words | Filmibeat Telugu
దిల్ రాజు రాబోయే సినిమాలు ఇవే

దిల్ రాజు రాబోయే సినిమాలు ఇవే

ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో జెర్సీ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే F2 రీమేక్‌తోను, హిట్ సినిమా హిందీ రీమేక్‌తో రెడీగా ఉన్నారు. బాలీవుడ్‌లో మరికొన్ని చిత్రాలు ప్లానింగ్ చేస్తున్నారు. తమ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమక పరిచయమైన ఆశీష్‌కు రౌడీ బాయ్స్‌తో సక్సెస్ ఇచ్చారు. త్వరలోనే సెల్ఫిష్ అనే చిత్రంతో సిద్దమవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X