Guntur Kaaram Event: మహేష్ తాట తీస్తాడు.. గుంటూరు కారం ఈవెంట్‌లో దిల్ రాజు కామెంట్స్

మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసిన దిల్ రాజు మరోసారి ఫన్నీగా తాట తీస్తాడు అనే పదాన్ని గుంటూరు కారం ఈవెంట్‌లో ఉపయోగించారు. యాంకర్ సుమ ఇచ్చిన జోష్‌తో ఆయన ప్రసంగం ఫన్నీగా, ఎమోషనల్‌గా సాగింది. మహేష్ బాబు, త్రివిక్రమ్, శ్రీలీలను పొగడ్తలతో ముంచెత్తుతూ దిల్ రాజు తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ..

Recommended Video

Dil Raju మాస్ స్పీచ్.. Mahesh Babu సైతం షాక్..| Guntur Kaaram | Telugu Filmibeat

హలో గుంటూరు..అందరికి నమస్కారం. సినిమా వైబ్స్ ఇక్కడ ఓ రేంజ్‌లో ఉన్నాయి. సినిమా రిలీజైన వైబ్ కనిపిస్తున్నది. నిర్మాత చినబాబుకు థ్యాంక్స్. మేము ఇండస్ట్రీలో సినిమాలు నిర్మిస్తుంటాం. ప్రతీ సినిమాను మేము చాలా కష్టపడి తీస్తాం. హారిక హాసిని, సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లలో సక్సెస్ ఫుల్ సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. అందుకు అందరికి థ్యాంక్స్ చెబుతున్నాను అని దిల్ రాజు అన్నారు.

 Dil Raju confirms Mahesh Babu movie blockbuster in Guntur Kaaram Pre Release Event

ప్రొడ్యూసర్‌గా సక్సెస్ సాధించడం ఈజీ కాదు. నాగవంశీ, చినబాబుకు తోడుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తోడుగా ఉన్నారు. వారికి అండగా నిలిచి సక్సెస్ సాధిస్తున్నారు. గుంటూరు కారం సినిమా అనగానే తమన్ గుర్తుకు వస్తాడు. ఇప్పటికే ఆయన రూపొందించిన కుర్చి మడతపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక థియేటర్లలో శ్రీలీల, మహేష్ బాబు చేసిన డ్యాన్సులు స్క్రీన్లు చినిగిపోతాయి అని దిల్ రాజు అన్నారు.

గుంటూరు కారం సినిమాకు తమన్ నెక్స్ లెవెల్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మీరు పేపర్లు ఎక్కువగా చించి పెట్టుకొండి. ఆయన బీజీఎంకు కాగితాలు ఎక్కువ కావాల్సిందే. కొన్ని సీన్లకు బీజీఎం మాములుగా ఉండదు. థ్యాంక్యూ తమన్.. బీజీఎం సూపర్ అని దిల్ రాజు అన్నారు.

గుంటూరు కారం సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరీ చాలా బాగా చేశారు. నేను చూసిన ఓ సాంగ్‌లో శ్రీలీల చేసిన డ్యాన్స్ మూములుగా లేదు. నాకు అంచనాలు పెంచడం ఇష్టంగా లేదు. శ్రీలీల పాటల్లో స్టెప్పలతో అదరగొట్టారు.

త్రివిక్రమ్ తన సినిమాల్లో ఏదో ఒక మాయ చేస్తారు. హీరో క్యారెక్టర్‌ను పట్టుకొని ఎమోషన్స్‌తో నవ్విస్తాడు. ఏడిపిస్తాడు. ఆయన ఎన్నో సినిమాలు తీశాడు. ఈ సినిమా విషయంలో మహేష్ బాబు బాక్సాఫీస్ కలెక్షన్లతో తాట తీస్తాడు. త్రివిక్రమ్ హీరో క్యారెక్టర్ రాసిన విధానం చూస్తే.. నాకు పోకిరి, దూకుడు సినిమాలు గుర్తుకు వచ్చాయి అని దిల్ రాజు చెప్పారు.

సంక్రాంతికి త్రివిక్రమ్ వదులుతున్న సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు ప్రతీ సినిమాలో ఒక పాటలో డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. 12 తేదీన గుంటూరు కారం కేవలం గుంటూరుకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని దిల్ రాజు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X