ఆ భయం వెంటాడుతున్నది.. అదే జరిగితే బ్లాస్టే.. దిల్ రాజు సెన్సేషనల్ కామెంట్స్
దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం జనక అయితే గనక. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సుహాస్ హీరోగా నటించారు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాసెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానున్నది. ఈ చిత్రంలో సంగీర్తన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ..
పెయిడ్ ప్రీమియర్లు మంచివా? చెడ్డవా? అనేది చెప్పలేం. పెయిడ్ ప్రీమియర్లు ఒక రోజు ముందు వస్తే ఆ సినిమా బాగుంటే ప్లస్ అవుతుంది. ఒకవేళ సినిమా తేడా కొట్టిందంటే రిలీజ్ రోజు కూడా ఎవరు రావడం లేదు. ఆ ప్రమాదం సినిమాను తీవ్రంగా నష్టపోయేలా చేస్తున్నది అని అన్నారు.

పెయిడ్ ప్రీమియర్లు ఒక రోజు ముందు వస్తే.. 6 గంటల షో చూసి..సోషల్ మీడియాలో పోస్టుల పెడుతున్నారు. సినిమా బాగుంటే మరుసటి రోజు బుకింగ్ పెరుగుతంది. బాగాలేక పోతే బ్లాస్ అవుతుంది. ప్రమోషన్ స్ట్రాటెజీ బాగుంది. చిన్న సినిమాలకు మంచి స్ట్రాటెజీ అని దిల్ రాజు అన్నారు.
50 సినిమాలు తీసి.. ఎంతో మంది దర్శకులను, నటులను పరిచయం చేసిన నాకే ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే భయమేస్తున్నది. చిన్న సినిమాలు తీయాలా? వద్దా అనే సందిగ్దంలో ఉన్నాను. ఇటీవల రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్లు, ఆయ్ సినిమాలు విజయం సాధించడంతో ధైర్యం వచ్చింది అని దిల్ రాజు తెలిపారు.
చిన్న సినిమాల విజయం నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చింది. మంచి సినిమాలు తీసుకొస్తే బారు చూడటానికి రెడీగా ఉన్నారు. అది చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అనేది చూడకుండా థియేటర్‌కు వస్తున్నారు అని అన్నారు.

ఇక జనక అయితే గనక సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను హీరో సుహాస్ తీసుకోవడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్కా ఎంటర్‌టైనర్. ప్రేక్షకులను మెప్పిస్తుందనే ధీమాతోనే హక్కులు తీసుకొన్నాను అని సుహాస్ అన్నారు.
నటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: దిల్‌రాజు ప్రొడక్షన్స్
సమర్పణ: శిరీష్
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి
రచన - దర్శకత్వం: సందీప్ బండ్ల
సంగీతం: విజయ్ బుల్గానిన్
డీఓపీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
ప్రొడక్షన్ డిజైనర్: అరసవిల్లి రామ్‌కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: భరత్ గాంధీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అకుల్
పీఆర్‌ఓ: వంశీకాకా.


Click it and Unblock the Notifications











