ప్రభాస్, మహేష్, విజయ్ దేవరకొండ, యశ్.. ఒక్క సినిమాలో!: దిల్ రాజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండ, యశ్, సిద్దార్థ వంటి స్టార్ హీరోల రిఫరెన్స్‌లు ఒకే సినిమాలో ఉన్నాయని, ప్రేక్షకులు మూవీని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ ఓ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశాయి. ఆ సినిమా ఏంటో కాదు.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'గాయపడ్డ సింహం'. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

టాలీవుడ్‌లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు.. కంటెంట్ నచ్చితే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. తాజాగా అలాంటి అంచనాల మధ్య 'గాయపడ్డ సింహం' మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మూవీ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) సినిమాపై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. సినిమాపై భారీ హైప్స్ పెంచేశారు. ఈ సినిమా ఇప్పటికే చూసానని, కథలోని కాన్సెప్ట్ బాగా నచ్చడంతో సినిమాను కొనుగోలు చేశానని తెలిపారు. అయితే సినిమా పూర్తిగా చూసే వరకు తనకు టెన్షన్ ఉందని, కానీ చూసిన తర్వాత మంచి నమ్మకం వచ్చిందని అన్నారు.

Dil Raju First Review on GaayaPaddaSimham Mahesh Babu to Prabhas References Surprise Fans

దిల్ రాజు ఇంకా మాట్లాడుతూ.. "ఈ సినిమాలో ఇద్దరు హీరోలు మాత్రమే కాదు.. మరో ఐదుగురు హీరోలను కూడా వాడేశారు. ప్రభాస్, మహేష్ బాబు, సిద్ధార్థ్, యష్, అలాగే మన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ రిఫరెన్స్‌లతో కొన్ని ఎపిసోడ్లు డిజైన్ చేశారు. ప్రేక్షకులు వాటిని థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు. అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వులతో నింపేశారని, సెకండ్ హాఫ్‌లో ఈ ఐదుగురు హీరోలకు సంబంధించిన ఐదు ఎపిసోడ్‌లను రూపొందించారని చెప్పారు. ఆ ఎపిసోడ్లు కనెక్ట్ అయితే సినిమా మరో జాతి రత్నాలు, మనీ తరహా కామెడీ హిట్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

దర్శకుడు కశ్యప్ పనితీరును కూడా దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. "ఈ సినిమాతో కశ్యప్ డైరెక్టర్‌గా సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు ఆదరిస్తే మరో తరుణ్ భాస్కర్‌లా ఎదుగుతాడు' అని కొనియాడారు. కశ్యప్ ఓ పాత్రలో కూడా కనిపిస్తాడని చెప్పారు. ఇక యాక్టర్స్ గురించి మాట్లాడుతూ.. హీరో తరుణ్ భాస్కర్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడని, శ్రీవిష్ణు ఎపిసోడ్ సెకండ్ హాఫ్‌లో హైలైట్ అవుతుందని చెప్పారు.

అలాగే J.D.చక్రవర్తి ఫస్ట్ హాఫ్‌లో విలన్‌గా కనిపించి, సెకండ్ హాఫ్‌లో కమెడియన్‌గా నవ్విస్తాడని చెప్పారు. మొత్తంగా దిల్ రాజు చేసిన కామెంట్స్‌తో 'గాయపడ్డ సింహం' సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ట్రైలర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో, మే 1న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Read more about: prabhas dil raju mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X