120 కోట్లతో టాక్సిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫేక్.. దిమ్మతిరిగే జవాబిచ్చిన దిల్ రాజు

కేజీఎఫ్ తర్వాత చాలా గ్యాప్ అనంతరం రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్, థియేట్రికల్ రైట్స్ అమ్మకం విషయం ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపింది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన యాక్షన్, థ్రిల్లర్ మూవీ రైట్స్‌ను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సొంతం చేసుకొన్నదనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రైట్స్‌ను అత్యధికంగా రేటు చెల్లించి దక్కించుకొన్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఈ బిజినెస్ డీల్ గురించి కొందరు స్పందిస్తూ.. ఆ రేంజ్‌లో బిజినెస్ జరుగలేదు. ఆ వార్తలో నిజం లేదు. ఆ ట్రేడ్ అంతా ఫేక్ అనే వార్తను ప్రచారం చేశారు. ఈ వార్తపై సంస్థ అధినేత దిల్ రాజు మార్కండేయ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో స్పందించారు. ఆయన చెప్పిన విషయం ఏమిటి? ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఎంత? అనే విషయం గురించిన వివరాల్లోకి వెళితే..

భారీ తారాగణం, టాలెంటెడ్ టెక్నిషియన్స్, హై బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీతోపాటు పలు భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాల థియేట్రికల్ రైట్స్‌ సుమారుగా 120 కోట్ల రూపాయలు చెల్లించి దిల్ రాజు సొంతం చేసుకొన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ మధ్య కాలంలో అత్యధికం, ట్రేడ్ సర్కిల్‌లో ఓ రికార్డు అని చెప్పుకొన్నారు.

Dil Raju on Toxic Telugu States Business

టాక్సిక్ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా కోసం దిల్ రాజు డేరింగ్ స్టెప్ వేశారు. ఈ రేంజ్‌లో బిజినెస్ డీల్ చేయడం ఛాలెంజ్ అంటూ కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో హక్కుల కోసం 120 కోట్ల రూపాయలు కమిషన్ బేస్ మీద అడ్వాన్సుగా చెల్లించి సొంతం చేసుకొన్నారు అని SVC అధికారికంగా వెల్లడించింది. అయితే ఇంత మొత్తాన్ని చెల్లించలేదు. కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారు అనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

టాక్సిక్ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 120 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారనే విషయంపై కొందరు రూమర్ అని అనడంపై దిల్ రాజు తీవ్రంగా స్పందించారు. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ గురించి డౌట్ పడే వాళ్లకు నేరుగా నా బ్యాంక్ అకౌంట్ చూపిస్తాను. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వాళ్ల అకౌంట్‌కు నా అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసిన అమౌంట్ చూపిస్తాను. నా బ్యాంక్ స్టేట్‌మెంట్ చూసైనా వాళ్లు నమ్ముతారో అనే చాలా స్ట్రాంగ్‌గా సెటైర్ వేశారు. దాంతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ గురించి వస్తున్న ఫేక్ వార్తలను ఆయన కొట్టిపడేశారు.

మాస్ ఎలిమెంట్స్‌, ఎలివేషన్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి హీరో యష్, గీతూ మోహన్ దాస్ కథను అందించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటి్ంచారు. ఇక ఈ సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ మ్యూజిక్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, కునాల్ శర్మ సౌండ్ ఇంజినీర్‌గా, గణేష్ ఆచార్య, ఇమ్రాన్ సర్దారియా, ఏ హర్ష కొరియోగ్రాఫర్లుగా, జేజే పెర్రీ, అంబరివ్, కెచా కంపాక్‌డీ, అమృత్ సింగ్ యాక్షన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

టాక్సిక్ సినిమా బిజినెస్ పరంగానే కాకుండా రిలీజ్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాను ధురంధర్ 2 సినిమాతో పోటీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం భారీ చర్చకు దారి తీసింది. ఇప్పటికే ధురంధర్ సినిమా రికార్డులను కొల్లగొట్టి భారీ హైప్ సాధించింది. ఇక టాక్సిక్ చిత్రంలోని కంటెంట్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా 2026, మార్చి 19వ తేదీన రిలీజ్ అవుతున్నది.

More from Filmibeat

Read more about: dil raju toxic yash
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X