Don't Miss!
- News గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సినిమాలు ఆడట్లేవ్.. ఎందుకు రిస్క్ అన్నాను.. హుషారు ప్రెస్మీట్లో దిల్ రాజు
లక్కీ మీడియా పతాకంపై రూపొందుతున్న చిత్రం హుషారు. సెలబ్రేషన్ ఆఫ్ బ్యాడ్ బిహేవియర్ ట్యాగ్‌లైన్. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేం రాజు తోట సినిమాటోగ్రాఫర్. భాస్కరభట్ల ఈ చిత్రానికి సాహిత్యాన్ని అందిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేం రాదాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
హుషారు చిత్రంలో తేజుస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేస్ తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ వీడియో ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాలు ఆడటం లేదు. ఏదో మ్యాజిక్ ఉంటే తప్ప ప్రేక్షకులు చూడటం లేదు. అంతేకాకుండా అంతా కొత్తవారితోనే తీస్తున్నావు. ఎందుకు రిస్క్ తీసుకొంటున్నావని అన్నాను. అయితే తాను తక్కువ బడ్జెట్లోనే సినిమాను ప్లాన్ చేశాను. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పాడు. సినిమా స్టార్ట్ చేశావు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పానని అన్నారు.
హుషారు పోస్టర్ చూసిన తర్వాత షాక్ అయ్యాను. అంతా చెడు కనిపిస్తుంది. నేనేమో మంచి చెప్పాలనుకొంటాను. అలాంటింది నాతో చెడు చెప్పిస్తున్నారు. ఈ రోజు మంచి, చెడు చూడటం లేదు. లిప్ లాక్‌లు ఉంటే ఆదరిస్తున్నారు. మేము కూడా వారి దారిలోనే రావాల్సి వస్తుందేమో. ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఏదో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉందని అనిపిస్తున్నది. చిత్రంలో అంతా కొత్తవారు నటించారు. వారందరికీ నా బెస్ట్ విషెష్ అని చెప్పారు. ఈ సందర్బంగా భాస్కరభట్ల రాసిన లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.