చిన్న సినిమాకు సాయం.. పీనట్ డైమండ్ కోసం దిల్ రాజు అలా!

నిర్మాతగా దిల్ రాజు టాలీవుడ్‌లో ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. దిల్ రాజుది లక్కీ హ్యాండ్ అని అందరూ అంటుంటారు. అలా దిల్ రాజు హ్యాండ్ పడితే సినిమాపై మంచి హైప్ ఏర్పడుతుంది. తాజాగా దిల్ రాజు పీనట్ డైమండ్ మూవీ కోసం ముందుకు వచ్చాడు. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న చిత్రం పీన‌ట్ డైమండ్.

పీనట్ డైమండ్ మూవీ టీజర్‌ను తాజాగా దిల్ రాజు రిలీజ్ చేశాడు. శుభలేఖ సుధాకర్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఈ టీజర్‌లో డైలాగ్‌లు అదిరిపోయాయి. 'విజయమా? మరణమా? అనేది అతను ఎంచుకునే మార్గాలను బట్టి ఉంటుంది'.. 'అతని జీవితాన్ని మలుపుతిప్పే రెండు సంఘటనలు ఒకే రోజు చోటు చేసుకున్నాయి'.. 'ఎంతో జ్ఞానం ఉన్నా కూడా అసుర లక్షణాలుండటంతో ఎన్నో తీవ్ర పరిణామాలు ఎదురయ్యాయ్' అనే డైలాగ్‌లు బాగున్నాయి.

Dil Raju In Peanut Diamond teaser,

ఇక పీనట్ డైమాండ్ సినిమాలో హీరో అభినవ్ దుమ్ములేపేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో రచ్చ చేశాడు. దర్శకుడు వెంకేటష్ త్రిపర్ణ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియే అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X