కేటీఆర్‌కు ఆ బాధ్యతలు.. శుభాకాంక్షలు తెలియజేసిన దిల్ రాజు!
ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాలలో పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శిస్తూ తిగులేని విజయంతో మరో మారు అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా కేటీఆర్‌కు కేసీఆర్ కొత్త బాధ్యతలు అప్పగించారు.
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ని నియమించిన సంగతి తెలిసిందే. దీనితో మరోమారు కేటీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రత్యేకంగా కేటీఆర్‌ని కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించినందుకు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. దిల్ రాజు, కేటీఆర్‌ని కలసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కేటీఆర్ అటు ప్రభుత్వానికి, ఇటు చిత్ర పరిశ్రమకు అనుసంధాన కర్తగా వ్యవహరించారు. చాలా మంది సినీ ప్రముఖులతో కేటీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే చాలా మంది సినీప్రముఖులు టిఆర్ఎస్ విజయాన్ని ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











