రజినీకాంత్‌తో దిల్ రాజు సినిమా.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన చిరంజీవి డైరెక్టర్!
తెలుగు అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. వరుసగా సినిమాలు నిర్మిస్తూ సత్తా చాటుతుంటారు. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వారసుడు సినిమాను బైలింగువల్ మూవీగా విడుదల చేశారు. దీని తర్వాత బలగం అనే చిన్న సినిమాను నిర్మించే పెద్ద హిట్ కొట్టి ఆశ్చర్యపరిచారు. అయితే విజయ్ తో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయనున్నారు. ఈ మూవీకి దర్శకత్వం వహించే లక్కీ ఛాన్స్ ను యంగ్ డైరెక్టర్ అందుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇతర భాషల్లోనూ : దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అయ్యారు. ఒకప్పుడు తెలుగులో విజవంతమైన డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా పేరు సంపాదించిన ఆయన తర్వాతి కాలంలో భారీ చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల కాలంలో కేవలం తెలుగుకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తూ సత్తా చాటుతున్నారు. అందులో భాగంగానే వారిసు నిర్మించి హిట్ కొట్టారు.

జైలర్ మూవీతో : ఇక ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. తనదైన స్టైలిష్ పర్ఫామెన్స్ తో అదరగొడతారు రజనీ కాంత్. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సైతం గట్టో పోటీ ఇస్తున్నారు తలైవా. ప్రస్తుతం ఆయన జైలర్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.
హీరోయిన్ గా రమ్యకృష్ణ : అపూర్వ రాగంగళ్ మూవీతో నటనలోకి అడుగుపెట్టిన రజనీకాంత్ చివరిగా పెద్దన్న సినిమాతో అభిమానులను, ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.

రెండు సినిమాలు : జైలర్ సినిమాను వచ్చే ఏడాది తమిళ సంవత్సరాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. ఇదే కాకుండా లైకా ప్రొడక్షన్ నిర్మాణంలో రజనీ కాంత్ మరో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తెలుగులో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న దిల్ రాజు రజనీ కాంత్ తో సినిమా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకోసం దిల్ రాజు మంచి ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.
అతనికి ఛాన్స్ : సూపర్ స్టార్ రజనీ కాంత్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు చిరంజీవితో వాల్తేరు వీరయ్య మూవీ ద్వారా సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం. అయితే ఈ మధ్య రజనీ కాంత్ నుంచి మంచి మాస్ మసాలా మూవీ వచ్చి చాలా కాలం అవుతుది. ఈ లోటు తీర్చేందుకు బాబీని పిక్స్ చేసినట్లుగా టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











