రేవంత్ వద్ద పంతం నెగ్గించుకొన్న దిల్ రాజు.. నాగవంశీ పరిస్థితి ఏంటంటే?
పుష్ప 2 చిత్రం ప్రీమియర్ సమయంలో జరిగిన దుర్ఘటన తర్వాత తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము అధికారంలో ఉన్నంత వరకు బెన్‌ఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని, టికెట్ల రేట్లు పెంచమని అసెంబ్లీలో వెల్లడించింది. అయితే తాజాగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిలీజవుతున్న సినిమాల విషయంలో తెలంగాణ సర్కార్ కొంత పట్టు విదిల్చింది. సినిమా పరిశ్రమ అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు రిక్వెస్ట్‌ను సానుకూలంగా పరిశీలించింది. ఇక ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళితే..
సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. సామాన్యుడికి వినోదాన్ని దూరం చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తున్నది. అయితే డిమాండ్ సప్లై అనే సూత్రం ప్రకారం టికెట్ల రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొన్నదని విషయాన్ని సినీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. దాంతో టికెట్ల రేట్లు పెంచాల్సిన అవసరం ఉందని దిల్ రాజు చెప్పి తన పంతాన్ని నెగ్గించుకొన్నారనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తున్నది.

సంక్రాంతి బరిలో దిల్ రాజ్‌కు సంబంధించిన మూడు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గేమ్ ఛేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలు స్వీయ నిర్మాణంలో రూపొందితే.. బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్‌ను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాంతో దిల్ రాజకు తప్పని పరిస్థితిగా టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో సీఎం రేవంత్ రెడ్డికి చేసిన రిక్వెస్ట్ వర్కవుట్ అయింది.
దిల్ రాజు అభ్యర్థన మేరకు తెలంగాణలో స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. మల్టిప్లెక్స్ టికెట్‌పై 150 రూపాయలు అదనంగా, సింగిల్ స్క్రీన్‌లో అదనంగా 100 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం వెసలుబాటు కలిగించింది. ఇక జనవరి 10వ తేదీ నుంచి 6వ ఆటకు, 11వ తేదీ నుంచి 5 ఆటలు పదర్శించుకొనేలా జీవోను జారీ చేసింది. అయితే బెన్‌ఫిట్ షోలకు ప్రభుత్వం మొండిచేయి చూపించింది. దాంతో ప్రభుత్వం వద్ద దిల్ రాజు తన మాటను నెగ్గించుకొన్నాడని సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే దిల్ రాజు కారణంగా టికెట్ రేట్లు పెంచే విషయంపై ఆసక్తి ప్రదర్శించిన డాకు మహారాజ్ నిర్మాత నాగవంశీకి అదృష్టం కలిసి వచ్చింది. ఈ సినిమాకు కూడా టికెట్లు రేట్లు పెరగడంతో భారీ కలెక్షన్లు ఈ సినిమా సాధించే చాన్స్ పెరిగింది. సంక్రాంతి సినిమాలు పెంచిన టికెట్ రేట్లతో ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తాయో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











