ఆ రెండు నెలలు చాలట.. వకీల్ సాబ్ రిలీజ్ ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. కెరీర్ లో ఎప్పడు లేని విధంగా పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక డిఫరెంట్ పాత్ర ద్వారా బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నాడు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన సందేశాత్మక చిత్రం పింక్. ఈ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
అసలైతే ఈపాటికె సినిమా షూటింగ్ పనులు పూర్తి కావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా బ్రేకులు పడ్డాయి. కరోనా ఎఫెక్ట్ వచ్చే నెల వరకు కొనసాగుతుండడంతో పవర్ స్టార్ సినిమా రిలీజ్ డేట్ పై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అసలైతే ఈ సినిమా మే నెలలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇక ఇప్పుడు చాలా పనులు పెండింగ్ లో ఉండడంతో మరింత ఆలస్యం అయ్యేలా ఉందని టాక్.

చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. జూన్, జులైలో సమయం దొరికినా చాలని ఆ రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేసి ఆగస్ట్ లో వకీల్ సాబ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు ప్రణాళికలు రచిస్తున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











