TFCC Election: ఉత్కంఠంగా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. గెలుపు ఎవరిది అంటే?
తెలుగు చిత్ర సీమలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు (Telugu Film Chamber Of Commerce Election) రసవత్తరంగా సాగాయి. మా ఎన్నికల తర్వాత అంతలా హోరా హోరీగా సాగిన ఎన్నికలు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎలక్షన్స్. ఈ ఎన్నికల్లో అగ్ర నిర్మాతలు అయినా సి. కల్యాణ్, దిల్ రాజు అందరి దృష్టిని ఆకర్షించారు. జూలై 11న వచ్చిన ఈ నోటిఫికేషన్ తో పోటాపోటీ మొదలు కాగా నేడు అంటే జూలై 3 ఆదివారం రోజున పోలింగ్, ఫలితాలను వెల్లడి అయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచారనే వివరాల్లోకి వెళితే..
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC Elections 2023) ఎన్నికలు వాడివేడిగా రసవత్తరంగా సాగాయి. ఈ ఎన్నికల్లో నిర్మాత సి. కల్యాణ్ ప్యానెల్ తో పాటు దిల్ రాజు ప్యానెల్ పోటా పోటీగా ఎదుర్కొన్నారు. అయితే ఎట్టకలేకు విజయం దిల్ రాజు ప్యానెల్ ను వరించింది. సి. కల్యాణ్ ప్యానెల్ ను ఓడించి దిల్ రాజు ప్యానెల్ గెలుపు జెండాను ఎగురవేసింది. ప్రొడ్యూసర్ సెక్టార్ లోని మొత్తం 12 స్థానాలకు ఏడింటిలో దిల్ రాజు ప్యానెల్ విజయ కేతనం ఎగురవేసింది.

ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో రెండు ప్యానెల్స్ నుంచి చెరో ఆరుగురు విజయం అందుకున్నారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో ఏక గ్రీవంగా ఎన్నికైన వారు కూడా దిల్ రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్టూడియో సెక్టార్ లో గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ వారే కావడం విశేషం. నిర్మాతల విభాగంలో దిల్ రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగులు గెలుపొందారు.
దిల్ రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ గౌడ్ లు నిర్మాతల విభాగంలో దిల్ రాజును ప్యానెల్ నుంచి గెలిచారు. ఇక ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.


Click it and Unblock the Notifications











