లక్కీ ఛాన్స్ అందుకున్న రాజ్ తరుణ్.. దిల్ రాజు నిర్మాణంలో మరోసారి!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఏడాది పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. గత ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది అలా జరగకూడదని దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 చిత్రం ఘనవిజయం సాధించడంతో దిల్ రాజు శుభారంభం చేశారు. దిల్ రాజు తక్కువ బడ్జెట్ లో చిత్రాలు నిర్మించి విజయాలు అందుకోవడంలో దిట్ట.
యువ హీరో రాజ్ తరుణ్ తో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ కు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇటీవల రాజ్ తరుణ్ కు సరైన విజయం లేదు. గత ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన రాజ్ తరుణ్ చిత్రం లవర్ తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో రాజ్ తరుణ్ కెరీర్ ట్రాక్ లోకి రావాలంటే వెంటనే ఓ హిట్ అందుకోవాలి. ఆడు మగాడ్రా బుజ్జి చిత్ర దర్శకుడు కృష్ణారెడ్డి వివరించిన కథ దిల్ రాజుని బాగా కట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కథకు రాజ్ తరుణ్ అయితే సరిపోతాడని అతడిని హీరోగా ఫైనల్ చేశారట. తక్కువ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని ఫినిష్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. దిల్ రాజు ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న మహర్షి లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











