ఆ నిర్మాత అంత నీచంగా మాట్లాడుతాడా? థియేటర్ల బంద్‌పై దిల్ రాజ్ క్లారిటీ
థియేటర్ల మూసివేత వివాదంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ దిల్ రాజ్ వివరణ ఇచ్చారు. తన ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. మినిస్టర్ కందుల దుర్గేష్ ఇచ్చిన సమాచారంతో సమస్య సద్దుమణిగింది. ఈ సమస్య ఏప్రిల్ 19వ తేదీన ఈస్ట్ గోదావరి జిల్లాలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొన్ని సమస్యలను తెరపైకి తెచ్చారు. మాకు పర్సంటేజ్ విధానం అమలు చేయాలని కోరారు. సంవత్సరానికి 150 సినిమాలు రిలీజ్ అయితే అందులో చాలా సినిమాలు పర్సంటేజ్‌పై ఆడుతున్నాయి. అందులో కొన్ని రెంట్ విధానంపై ఆడుతున్నాయి. అందుకే మాకు పర్సంటేజ్ విధానం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. మా సమస్య పరిష్కారం కాకపోతే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తామని పిలుపునిచ్చారు.అయితే మా గిల్డ్‌కు ఈ విషయం అందినప్పుడు.. వారి సమస్యలు చర్చించేందుకు సిద్దమయ్యాం.
కానీ ఏప్రిల్ 26న గిల్డ్‌లో మీటింగ్ జరిగింది. ఆ సమయంలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత ఆ రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారంలో ఆ నలుగురు అంటూ మమ్మల్ని టార్గెట్ చేయడం బాధాకరం. తెలంగాణలో మొత్తం 370 థియేటర్లు ఉంటే.. అందులో మాకు ఉన్న థియేటర్లు 30 మాత్రమే. ఉత్తరాంధ్రలో 20 థియేటర్లు ఉన్నాయి. అంతకుమించి మాకు థియేటర్లు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌గా, నిర్మాతగా తెలుగు రాష్ట్రాల సినిమా రంగానికి పెద్దగా నాకు ఓ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్తాం అని దిల్ రాజు అన్నారు.
రెంట్ లేదా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలి. అయితే ఎగ్జిబ్యూటర్లు డిమాండ్ చేస్తే.. మీరు నిర్మాతల దృష్టికి తీసుకు రండి. దానిపై ఓ పరిష్కారం సూచిస్తామని చెప్పాం. కానీ ఎగ్జిబ్యూటర్లు మాత్రం మా డిమాండ్‌కు పరిష్కారం లభించకపోతే మేము జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లకు బంద్ చేస్తామని చెప్పారు. ఆ మీటింగ్ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మీడియాలో బ్రేకింగ్ బయటకు వచ్చింది. ఆ తర్వాత నేను ఛాంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకొన్నాను అని దిల్ రాజ్ తెలిపారు.

ఆ తర్వాత డిస్టిబ్యూటర్ల మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో థియేటర్లు ఇస్తే మేము సినిమాలు రిలీజ్ చేసేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. ఇప్పటి వరకు కోవిడ్‌లో తప్పా ఎన్నడూ థియేటర్లు మూయలేదు. డిస్టిబ్యూటర్లు థియేటర్లు మూసే ప్రసక్తే లేదని వారు ధృవీకరించారు. ఆ తర్వాత నిర్మాతల మండలిలో కూడా చర్చ జరిగితే.. సినిమా థియేటర్లు బంద్ చేయకూడదని అందరం నిర్ణయించాం అని దిల్ రాజు వివరించారు.
థియేటర్ల మూసివేత అంశాన్ని పవన్ కల్యాణ్ సినిమాకు ముడిపెట్టి లీకులు ఇచ్చారు. కానీ కల్యాణ్ గారి సినిమాను ఆపే దమ్ము ఎవరికి లేదు. కానీ కల్యాణ్ సినిమాను అడ్డుకొంటునేందుకు కుట్ర జరుగుతున్నది అనే విషయం ఏపీ ప్రభుత్వానికి చేరింది. దాంతో ఈ అంశం మరింత వివాదంగా మారింది. అయితే కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి అపోహలు వచ్చాయి. నిర్మాతలు, డిస్టిబ్యూటర్ల మధ్య జరిగిన చర్చ ఒకటి.. అది బయటకు వచ్చింది మరొక రకంగా వచ్చింది. అయితే ఈ పరిస్థితిని అర్ధం చేసుకొన్నందుకు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు అని దిల్ రాజ్ అన్నారు.
సినీ పరిశ్రమలో ఏకాభిప్రాయం లేదు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కల్యాణ్ గారిని కలిసినప్పుడు.. ఇండస్ట్రీ పెద్దలు వచ్చి వారి సమస్యల గురించి మాట్లాడాలని పవన్ కల్యాణ్ సూచించారు. కానీ అందరూ కలిసి వెళ్లకుండా ఎవరికి వారు వెళ్లి టికెట్ రేట్లు పెంచుకోవడం, బెన్‌ఫిట్ షోలకు పర్మిషన్‌లు తెచ్చుకోవడం చేశారు. ఛాంబర్ నుంచి కానీ, నిర్మాతలు గానీ కలిసి ఐక్యంగా సమస్యను పరిష్కరించే ఉద్దేశం కనిపించలేదు. సినిమా పరిశ్రమలో ఎవరికి వారే ఇలా ప్రవర్తించడం సరికాదు అని దిల్ రాజ్ అన్నారు.
ఛాంబర్ ప్రతినిధులు సరిగా వివరణ ఇవ్వకపోవడం, అలాగే మీడియా అత్యుత్సాహం వల్లే థియేటర్ల బంద్ వివాదం ఏర్పడింది. ఈ వివాదం ఏపీ ప్రభుత్వానికి మరో విధంగా వెళ్లింది.ఏదైనా జరిగినప్పుడు ఛాంబర్ నుంచి ఓ ప్రకటన రిలీజ్ చేయాలి. కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. చర్చలు విఫలమైతే థియేటర్లు మూసివేస్తామని క్లారిటీతో చెప్పలేకపోవడం వల్లే ఈ వివాదం ఏర్పడింది అని దిల్ రాజు అన్నారు.
అరవింద్ మాట్లాడుతూ.. నాకు 15 థియేటర్లు ఉన్నాయి. వాటి లీజ్ అయిపోతే వాటిని రెన్యువల్ చేయనని చెప్పాడు. ఆ సినిమా హాళ్ల ద్వారా లాభం వస్తే.. ఆయన ఎందుకు వదులుకొంటాడు? అని దిల్ రాజ్ ప్రశ్నించారు. అంతేకాకుండా చాలా సినిమాలు మూత పడే ప్రమాదం ఉంది. గత 15 ఏళ్లలో కొత్తగా థియేటర్లు కట్టిన దాఖలాలు లేవు. కొన్ని థియేటర్లు ఫంక్షన్ హాల్స్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిబ్యూటర్ కష్టాలు మాకు తెలుసు. ఎందుకంటే నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా ఆ తర్వాత ఎగ్జిబ్యూటర్‌గా వివిధ హోదాల్లో అనుభవం ఉంది. ఈ మూడు విభాగాలను కలిపి సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం అని దిల్ రాజు చెప్పారు.
ఆ నలుగురిలో అరవింద్ నేను లేనని చెప్పిన విషయం చూశాను. ఇప్పుడు నేను కూడా చెబుతున్నాను. నేను కూడా ఆ నలుగురిలో లేను. నన్ను టార్గెట్ చేయవద్దు. ఈస్ట్ గోదావరిలో జరిగిన మీటింగ్‌లో దిల్ రాజు లేనప్పుడు అతడిని ఎందుకు ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? అని దిల్ రాజు ప్రశ్నించారు. ఆ మీటింగ్‌లో నిర్ణయం తీసుకొన్న వ్యక్తి డిస్టిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేన నేత అనే విషయం తెలుసుకొండి అని అన్నారు.
ఇదిలా ఉండగా, కొందరు పబ్లిసిటీ కోసం తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయినప్పుడు పైరసీ జరిగింది. ఈ టెలివిజన్ ఛానెల్‌లో ఓ నిర్మాత మాట్లాడుతూ.. దిల్ రాజే పైరసీ చేయించి ఉంటాడనే మాట్లాడారు. ఇలా ఎవరైనా నీచంగా మాట్లాడుతారా? పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతారా? నా సినిమాను నేను పైరసీ చేస్తానా? అని దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











