పెద్దన్న పవన్ కల్యాణ్ కోపం వచ్చింది.. ఆయన తిడితే పడుతాం.. దిల్ రాజు
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత వివాదంపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ దిల్ రాజ్ వివరణ ఇచ్చారు. తన ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. గత 9 రోజులుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికేందుకు పలు విషయాలను వెల్లడించారు.మినిస్టర్ కందుల దుర్గేష్ ఇచ్చిన సమాచారంతో సమస్య సద్దుమణిగింది అని క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వివాదంలో జరిగిన మిస్ కమ్యూనికేషన్ గురించి వివరించారు.ఇంకా ఆయన ఏం మాట్లాడరంటే..
థియేటర్ల మూసివేత సమస్య ఏప్రిల్ 19వ తేదీన ఈస్ట్ గోదావరి జిల్లాలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొన్ని సమస్యలను తెరపైకి తెచ్చారు. మాకు పర్సంటేజ్ విధానం అమలు చేయాలని కోరారు. అక్కడ మొదలైన ఆ డిమాండ్ తెలంగాణ వరకు వచ్చింది. ఆ విషయం గురించి ఫిలిం ఛాంబర్,గిల్డ్‌లో చర్చించాం. అయితే థియేటర్లు మూసివేయొద్దని చెప్పాను. కానీ నేను బయటకు రాగానే మీడియాలో బ్రేకింగ్, స్క్రోలింగ్‌లు రావడం నన్ను షాక్‌కు గురి చేసింది అని దిల్ రాజు అన్నారు.

నేను ఇండస్ట్రీలోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నది.నా అనుభవంలో ఇప్పటి వరకు సినిమా థియేటర్లను మూసివేయడమనేది జరగలేదు. నిర్మాతలుగా మాకు సమస్యలు ఉండటంతో మేము సినిమా షూటింగులు ఆపివేశాం. కానీ ఏనాడు థియేటర్లను మూయడానికి ప్రయత్నించలేదు. ఈ వ్యవహారం, ఈ ఎపిసోడ్ మరో విధంగా పవన్ కల్యాణ్ సినిమాపైకి వెళ్లింది. ప్రభుత్వానికి కూడా అదే విధంగా కమ్యూనికేట్ చేశారు. ఎవరు తీసుకెళ్లారో తెలియదు. అలా ఎవరు అడ్వాంటేజ్ తీసుకొన్నారో తెలియదు. భయం, భక్తితోనే ఈ వ్యవహారాన్ని తప్పుదారి పట్టించారు అని దిల్ రాజు అన్నారు.
మాకు పవన్ కల్యాణ్ పెద్దన్న. ఆయనకు కోపం వచ్చింది. ఆయన తిడుతారు. మేము పడుతాం. కల్యాణ్ గారు హర్ట్ అయ్యారు. హర్ట్ అయితే ఆయన తిట్టే అధికారం ఉంది. కల్యాణ్ గారి గురించి 22 ఏళ్లుగా చూస్తున్నాను. ఆయనకు కోపం వచ్చేలా ఎపిసోడ్ క్రియేట్ అయింది. ఆయన సినిమాను టార్గెట్ చేసిందనే కమ్యూనికేషన్ వెళ్లింది. అయితే ఫిలిం ఛాంబర్‌లో ఏం జరిగిందో మాకు తెలియదు. ఛాంబర్‌లో జరిగిన మీటింగ్ గురించి ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెబుతాను. కానీ వారు దానిని పాటించరు. లోపల ఏం జరిగిందో తెలియదు. కొందరు ఫోన్ చేసి లీకులు ఇస్తారు. దాని వల్లే ఇలాంటి మిస్ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది అని దిల్ రాజ్ చెప్పారు.

థియేటర్ల మూసివేత వివాదంలో నా పేరు డైరెక్టుగా వినిపించలేదు. కానీ పరోక్షంగా వచ్చిందనే విషయం నా వద్దకు వచ్చింది. అయితే పవన్ కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికి లేదు. ఫస్ట్ థియేటర్లు మూసివేయరు. హరిహర వీరమల్లు సినిమాను ఆపేందుకు ప్లాన్ చేశారనే సమాచారం ప్రభుత్వానికి వెళ్లింది.దాంతో ఈ వివాదం చెలరేగింది.ఆ సమయంలోనే మంత్రి కందుల దుర్గేష్ నాతో మాట్లాడితే.. ఎట్టి పరిస్థితుల్లోను థియేటర్లు మూయరని చెప్పానని దిల్ రాజ్ చెప్పారు.
మే 30 తేదీన భైరవం సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 5వ తేదీ కమల్ హసన్ సినిమా, జూన్ 12 కల్యాణ్ గారి సినిమా. జూన్ 20 కుబేరా సినిమా ఉంది. జూన్ నెల అంతా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జూలై 5వ తేదీన మేము తమ్ముడు సినిమాను రలీజ్ చేయాలని అనుకొన్నాం. అయితే కింగ్ డమ్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందుచేత తమ్ముడు సినిమాను వాయిదా వేశాం. మరో డేట్‌ను డిక్లేర్ చేస్తున్నాం.ఏప్రిల్ నెలలో ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీకి ప్రతికూలంగా ఉంటుంది. ఐపీఎల్, ఇతర అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే థియేటర్లు మూసే పరిస్థితి వచ్చింది. అయితే ఈ వ్యవహారం ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్లింది అని దిల్ రాజు అన్నారు.


Click it and Unblock the Notifications











