RED మూవీ ఖచ్చితంగా హిట్.. టాలీవుడ్‌కి పెద్ద పండుగ.. దిల్ రాజ్ జోస్యం
ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ నటిస్తున్న చిత్రం RED. తమిళ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై క్లాస్‌ను, మాస్‌ను ఆకట్టుకొనే విధంగా చిత్రాన్ని స్రవంత్రి మూవీస్ తెరకెక్కిస్తున్నది.
రెడ్ ట్రైలర్ విడుదల సమావేశం సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "చాక్లేట్ బాయ్ ఇమేజ్ నుండి ఇస్మార్ట్ శంకర్ లో విశ్వరూపం చూపించి మాస్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు రామ్. ఇప్పుడు రెడ్ తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు. ఆశ్చర్యమేంటంటే చాలా సున్నితంగా, క్లాస్ గా కనిపించే డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా ఈ చిత్రం తో తాను మాస్ చిత్రాలు రాయగలడని, తీయగలడు అని చూపించుకున్నాడు. ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ కథ, సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి.

అలాగే హీరో రామ్ పోతినేని డబుల్ రోల్ లో చాలా బాగా చేసాడు. ఖచ్చితంగా హిట్టు కొట్టబోతున్న చిత్రం ఇది. నిర్మాత రవికిశోర్ గారి నిర్ణయాలు, డైరెక్టర్ కిషోర్ తిరుమల కథ విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఈ చిత్రంలో కూడా కనిపిస్తాయి, మణిశర్మ సంగీతం గట్టి బలమవుతుంది, అలాగే మంచి టీమ్ ఉంది ఈ చిత్రానికి. ఇస్మార్ట్ శంకర్ తరువాత ఈ పండగకి వస్తున్న రెడ్, రామ్ కి దానికంటే పెద్ద హిట్ అవ్వబోతోంది. పరిశ్రమకి పండగకి పెద్ద హిట్ రామ్ ద్వారా రానున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
9 నెలల తరువాత మళ్ళీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా చిత్ర పరిశ్రమ సిద్దమయ్యింది. ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలనుండి మొదలుకుని సంక్రాంతికీ, ఆ తరువాత కూడా విడుదలవ్వడానికి సిద్ధంగా ఉన్న చిత్రాలన్నిటికీ మంచి విజయం దక్కాలి అని, థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు అన్ని జాగ్రత్తల మధ్యే చిత్రాన్ని చూసి ఆనందించాలని కోరుకుంటున్నాం." అని అన్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్
ఫైట్స్: పీటర్ హెయిన్స్
ఎడిటింగ్: జునైద్
సమర్పణ: కృష్ణ పోతినేని,
నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్,
దర్శకత్వం : కిశోర్ తిరుమల


Click it and Unblock the Notifications











