దిల్ రాజు రెండో పెళ్లి.. కంటతడి పెట్టించేలా.. యూఎస్‌ నుంచి కూతురు మెసేజ్

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరోసారి వివాహం చేసుకొన్నారు. సతీ వియోగంతో ఒంటరివాడైన దిల్ రాజు ఆదివారం రాత్రి (మే 10వ తేదీన) వైఘా రెడ్డి అలియాస్ తేజస్వినిని నిజామాబాద్‌లోని తన ఫ్యామిలీకి సంబంధించిన వెంకటేశ్వర ఆలయంలో పెళ్లి చేసుకొన్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ పెళ్లికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా తండ్రి దిల్ రాజుకు ఆయన కూతురు హన్షితారెడ్డి అందజేసిన శుభాకాంక్షలు ఎమోషనల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..

సతీ వియోగంతో

సతీ వియోగంతో

నిర్మాత దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో 2017లో మరణించారు. భార్య మరణించే నాటికి ఆయన షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. ఆ వార్త తెలియగానే వెంటనే ఇండియాకు చేరుకొన్నారు. అనితారెడ్డికి దిల్ రాజుకు అన్షితారెడ్డి అనే కూతురు ఉన్నారు. ఆమె వివాహం ఇటీవలే జరిగింది. ప్రస్తుతం ఆమె కుటుంబం అమెరికాలో ఉంటున్నారు. లాక్ డౌన్ కారణంగా తండ్రి వివాహానికి ఆమె దూరంగా ఉన్నారు.

కరోనాతో పరిస్థితులు మారిపోయాయి

కరోనాతో పరిస్థితులు మారిపోయాయి

ఇక తన పెళ్లి వార్తను నిర్మాత దిల్ రాజు స్వయంగా ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరోనావైరస్ వ్యాప్తితో ప్రపంచం పరిస్థితి అంతగా బాగాలేదు. ఇప్పట్లో కోలుకుంటుందని నేను అనుకోవడం లేదు.ఇలాంటి సమయంలో నేను ప్రొఫెషనల్‌గా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతా త్వరలోనే సర్దుకుంటుందని భావిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకొంటున్నాను. ఈ సమయం నాకు అన్ని విధాల కలిసి వస్తుందని భావిస్తున్నాను అని ఓ ప్రకటనలో దిల్ రాజు పేర్కొన్నారు.

Recommended Video

Dil Raju Second Marriage Photos Gone Viral In Social Media
మీరే నాకు బలం

మీరే నాకు బలం

తండ్రి దిల్ రాజు పెళ్లిపై హన్షితారెడ్డి ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. నాకు మీరే మానసిక స్థైర్యం, అండ. మీకు ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. కుటుంబ విలువకు మీరు ఎంత ప్రాధాన్యం ఇస్తారో నా కంటే ఎవరికి ఎక్కవుగా తెలియదు. మీ చేతి పట్టుకొని నడిచిన అనుభవం, ఆనందం మాటల్లో చెప్పలేను అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మీ ఇద్దరి ప్రయాణం అద్బుతంగా సాగాలి

మీ ఇద్దరి ప్రయాణం అద్బుతంగా సాగాలి

నాన్న మీ జీవితంలో అనుకోని పరిస్థితులు చోటుచేసుకొన్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు ప్రారంభిస్తున్న కొత్త జీవితం అద్భుతంగా సాగాలి. మీరిద్దరి మధ్య జీవితం ప్రేమానురాగాలు ముందు కొనసాగాలి. ఇక నుంచి మీ జీవితంలో ప్రతీ రోజు ఓ పండుగలా.. కొత్త అనుభూతితో ఉండాలని కోరుకొంటున్నాను. మీరంటే ఎప్పటికీ చెప్పలేనంత ప్రేమ, ఇష్టం... ఇట్లు మీ హర్షు అంటూ హర్షితారెడ్డి ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టారు.

దిల్ రాజు ప్రాజెక్టులు

దిల్ రాజు ప్రాజెక్టులు

ఇక దిల్ రాజు కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో రూపొందిన పింక్ చిత్రాన్ని రీమేక్‌గా వకీల్ సాబ్‌ను నిర్మాత బోనికపూర్‌తో కలిసి నిర్మిస్తున్నాు. ఇక 2012లో అల్లు అర్జున్‌తో ఐకాన్ అనే సినిమాను తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండతో కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X