లిప్ లాక్స్ ఉంటేనే చూస్తున్నారు.. నేను కూడా అలాంటి సినిమాలే తీయాలేమో!
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గత ఏడాది వరుస విజయాలు అందుకున్నారు. కానీ ఈ ఏడాది ఆయన నిర్మించిన శ్రీనివాస కళ్యాణం, లవర్ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. తాజగా హుషారు చిత్ర సాంగ్ టీజర్ లాంచ్ కార్యక్రమానికి దిల్ రాజు అతిధిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుషారు చిత్రాన్ని చెడు చూస్తాను, చెడు మాట్లాడతాను, చెడు వింటాను అనే అంశాలతో తెరకెక్కిస్తున్నారు. భవిషత్తులో నేను కూడా ఎలాంటి సినిమాలే తీయాల్సి వస్తుందేమో అని దిల్ రాజు అన్నారు. ఆడియన్స్ మంచి, చెడు గురించి పట్టించుకోవడం లేదు. వాళ్లకు మ్యాజిక్ కావాలి, ఎంటర్ టైన్మెంట్ ఉండాలి అని అన్నారు.

లిప్ లాక్స్ ఉన్న సినిమాలే ఆడుతున్నాయని దిల్ రాజు అభిప్రాయ పడ్డారు. బోల్డ్ కంటెంట్ తో విడుదలైన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి, హీరో రామ్ నటిస్తున్న హలో గురు ప్రేమకోసమే చిత్రాలని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











