Dil Raju: సమంత శాకుంతలంపై దిల్ రాజు రియాక్షన్.. నా 25 ఏళ్ల కెరీర్‌లో ఊహించలేదంటూ!
తెలుగు బడా నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. వరుసగా సినిమాలు నిర్మిస్తూ సత్తా చాటుతుంటారు. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వారసుడు సినిమాను బైలింగువల్ మూవీగా విడుదల చేసి మంచి విజయం సాధించారు. అలాగే బలగం అనే చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టి ఆశ్చర్యపరిచారు. అయితే స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వచ్చిన శాకుంతలం మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన శాకుతలంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన శాకుంతలం సినిమాను డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వం వహించారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించారు. ఎపిక్ మైథాలాజికల్ మూవీగా తెరకెక్కిన శాకుంతలం ఎన్నో వాయిదాలు పడి చివరిగా ఏప్రిల్ 14న విడుదలైంది. అయితే విడుదల ఆలస్యానికి విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా చూపారు. దానికోసం దిల్ రాజు రూ. 3 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం.

స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్, కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నటించిన శాకుంతలం సినిమా విడుదల తర్వాత ఊహించని విధంగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రిలీజ్ తర్వాత వసూళ్లు భారీగా పడిపోయాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ సినీ ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీ విజువల్ గ్రాఫిక్స్ పై, మెలోడీ బ్రహ్మా మణిశర్మ సంగీతంపై విమర్శలు వచ్చాయి. దీంతో శాకుంతలం మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాకుంతలం సినిమా ఫలితంపై దిల్ రాజు స్పందించారు. శాకుంతలం సినిమా మిస్ ఫైర్ అయింది. సోమ, మంగళ వారాల్లో కలెక్షన్స్ రాలేదంటే అప్పుడే ఫిక్స్ అయిపోవాలి. రియలైజ్ కావాలి. శాకుంతలం నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది. నా 25 ఏళ్ల కెరీర్ లో ఇది ఎప్పుడూ ఊహించలేదు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇదే ఇంటర్వ్యూలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లతో ప్రాజెక్ట్స్ ఖరారు అయినట్లు కూడా దిల్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











