Sankranti Releases వ్యక్తిగతంగా డామేజ్ చెయ్యొద్దు.. నేను ఉండొచ్చు.. ఉండక పోవచ్చు.. దిల్ రాజు
తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఐదు సినిమాలు రిలీజ్ కావడం వివాదంగా మారాయి. జనవరి 12వ తేదీన మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌లో వస్తున్న హనుమాన్, వెంకటేష్ నటించిన సైంధవ్, నాగార్జున అక్కినేని నటించిన నా సామిరంగ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించడానికి ఈగిల్ సినిమా రిలీజ్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాయిదా వేసుకొన్నది. ఈ నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ..
Recommended Video

సోషల్ మీడియా గానీ, వెబ్‌సైట్స్ గానీ, న్యూస్ ఛానెల్స్ గానీ తెలుగు సినిమా పరిశ్రమకు చాలా ఇంపార్టెంట్. చాలా సపోర్టుగా ఉంటారు. కానీ కొన్ని విషయాలను కావాల్సుకొని.. ఇతర మార్గాల వచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకొని రాసే వార్తలు వ్యక్తిగతంగా డామేజ్ చేస్తాయి అని దిల్ రాజు అన్నారు.

కొన్ని విషయాలను మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీకు లభించిన సమాచారంతో రాసే వార్తలు వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలుగకుండా చూసుకోవాలి. ఈ రోజు నేను ఉండొచ్చు.. రేపు మరొకరు రావొచ్చు. నేను వ్యక్తిగతంగా, తెలుగు, తెలంగాణ ఛాంబర్ల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అని దిల్ రాజు అన్నారు.
2024 సంవత్సరం సంక్రాంతి పండుగ బరిలో చాలా సినిమాలు ఉంటాయని 6 నెలలుగా అందరం అనుకొన్నాం. గేమ్ ఛేంజర్ సినిమాను రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ వీలు కాలేదు. మా ఫ్యామిలీ మ్యాన్ సినిమా వాయిదా పడిన తర్వాత ఈ సంవత్సరం 5 సినిమాలు రిలీజ్‌కు ఫోటీ పడ్డాయి. ఆ సమయంలో పోటిని నివారించేందుకు తెలుగు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ల ప్రతినిధులు, ఆయా సినిమాల నిర్మాతలతో చర్చించాం. ఆ సమయంలో హనుమాన్ సినిమా నిర్మాత రాలేదు అని దిల్ రాజు తెలిపారు.
తెలుగు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ల ప్రతినిధులతో 15 రోజుల క్రితం జరిగిన సమావేశంలో.. ఎవరైనా సంక్రాంతి రేసు నుంచి తమ సినిమాను విత్ డ్రా చేసుకోవాలని రిక్వెస్ట్ చేశాం. దాని వల్ల ఆయ సినిమాల బిజినెస్ మెరుగ్గా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐదుగురు నిర్మాతలతో చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఒక్క సినిమా తగ్గినా బాగుంటుందని అనుకొన్నాం. గతేడాది 3 సినిమాలకే రచ్చ జరిగింది. అలాంటిది 5 సినిమాలంటే పరిస్థితి చేజారే అవకాశం ఉంది దిల్ రాజు అన్నారు.

ఐదు సినిమాల నిర్మాతలతో చర్చించిన తర్వాత ఈగిల్ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సానుకూలంగా స్పందించారు. వారి సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకొన్నారు. ఇది మంచి పరిణామం. వారు తమ సినిమాను వాయిదా వేసుకోవడం వల్ల 4 సినిమాలు పోటీలో ఉన్నాయి. వారికి సోలో రిలీజ్ ఉండేలా చూసుకొంటాం. ఫిబ్రవరి 9న ఈగిల్ వసున్నది. ఆ సమయంలో ఎవరు కూడా పోటీలో ఉండకుండా నిర్ణయం తీసుకొంటాం అని దిల్ రాజు చెప్పారు.
పెద్ద సినిమాలను బట్టి స్క్రీన్లు కేటాయిస్తాం. ముందు మహేష్ బాబు సినిమా గుంటూరు కారం, ఆ తర్వాత వెంకటేష్ సైంధవ్, నాగార్జున అక్కినేని నా సామిరంగ సినిమాలకు స్క్రీన్లను కేటాయిస్తాం. ఆ తర్వాత హనుమాన్ సినిమాకు స్క్రీన్లు కేటాయిస్తాం. కాబట్టి మీడియా దీనికి సహకారం అందించాలి. మీరు పాజిటివ్‌గా స్పందిస్తే.. మేము మంచి చేయడానికి ముందు వెళ్తాం. నెగిటివ్‌గా స్పందిస్తే ఏమీ కాదు అని దిల్ రాజు పేర్కొన్నారు.
అయితే ఈ సమావేశం చివర్లో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి వెల్లడించిన అభిప్రాయాన్ని దిల్ రాజు దృష్టికి తీసుకెళ్లగా.. దానిని దాటవేసేందుకు ప్రయత్నించారు. అయితే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నది. కాబట్టి హిందీలో శుక్రవారం రిలీజ్ చేయాల్సి వస్తుందని ప్రశాంత్ వర్మ చెప్పారు. వీలైనంత మేరకు అందరికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











