twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్లు ఎందుకు ఓపెన్ చేయలేదు..సినీ నిర్మాతలను ప్రశ్నించిన సర్కార్.. ఆ విషయంలో చేతులెత్తీసిన పరిశ్రమ

    |

    తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సంపూర్ణంగా ఎత్తివేస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేయడంపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. గత క్యాబినెట్‌లో బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకొన్నారు. అయితే తెలంగాణ ప్రాంతంలో థియేటర్లు రీ ఓపెన్ చేస్తారనే నేపథ్యంలో సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య వచ్చిన చర్చకు వచ్చిన అంశాలు ఏమిటంటే..

    తెలంగాణ సీఎస్‌తో సినీ నిర్మాత భేటి

    తెలంగాణ సీఎస్‌తో సినీ నిర్మాత భేటి

    లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో సినిమా షూటింగులు జోరందుకొన్నాయి. కానీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. ఆ విషయం ఇటీవల మీడియాలో పలు రకాల కథనాలు వినిపించాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణరావు భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో జరిగిన సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, దామోదర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

    థియేటర్లు ఎందుకు రీ ఓపెన్ చేయలేదంటూ

    థియేటర్లు ఎందుకు రీ ఓపెన్ చేయలేదంటూ

    సినీ ప్రముఖులతో జరిగిన చర్చలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో థియేటర్స్ ఎందుకు రీఓపెన్ చేయలేదు. సినిమాలను ఎందుకు రిలీజ్ చేయడం లేదు అని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే థియేటర్ల రీ ఓపెన్‌కు సంబంధించిన ఇబ్బందులను సీఎస్‌ సోమేశ్ కుమార్‌కు నిర్మాతలు వివరించినట్టు తెలిసింది.

    ఏపీలో థియేటర్లు ఓపెన్ చేస్తే..

    ఏపీలో థియేటర్లు ఓపెన్ చేస్తే..

    అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నదు. అలాంటి పరిస్థితుల్లో సినిమాలను విడుదల చేసి తాము నష్టాల పాలు కాలేము అని నిర్మాతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. ఆంధ్రా ప్రాంతంలో థియేటర్స్ ఓపెన్‌కు అనుమతిస్తే తప్ప విడుదల సాధ్యం కాదు అని నిర్మాతలు స్పష్టం చేశారని తెలిసింది.

    సీఎస్ సోమేశ్ కుమార్ ముందు డిమాండ్లు

    సీఎస్ సోమేశ్ కుమార్ ముందు డిమాండ్లు

    రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ముందు సినీ నిర్మాతలు కొన్ని డిమాండ్లను పెట్టినట్టు తెలిసింది.థియేటర్లలో పెయిడ్ పార్కింగ్‌కు అనుమతించాలి. పెయిడ్ పార్కింగ్ వల్లే 40 శాతం థియేటర్ యాజమాన్యాలకు ఆదాయం ఉంటుంది అని నిర్మాతల చెప్పినట్టు సమాచారం. అలాగే చిన్న నిర్మాతలకు, సినిమాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి చెప్తాను అని సీఎస్ సోమేశ్ కుమార్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం.

    Recommended Video

    Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
    ఏపీలో 50 శాతం అక్యుపెన్సీతో

    ఏపీలో 50 శాతం అక్యుపెన్సీతో

    ఇదిలా ఉండగా, ఏపీలో థియేటర్ల ఓపెన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేవలం 50 శాతం అక్యుపెన్సీతో సినిమాలను రిలీజ్ చేయాలని, థియేటర్లలో సినిమాలను ప్రదర్శించాలని సూచించినట్టు తెలిసింది. అయితే అందుకు సినీ నిర్మాతలు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదనే వాదన బయటకు వచ్చింది. 50 శాతం అక్యుపెన్సీతో నష్టాలు తప్ప మరోటి రాదనే విషయాన్ని పలువురు నిర్మాతలు ప్రస్తావించినట్టు తెలిసింది.

    English summary
    Tollywood's ace producers Dil Raju, Suresh Babu and other Film Chamber members met Telangana CS Somesh Kumar over Theatres open after second wave of the Corona. Producers has given representation to government and requested to implement paid parking in Theatres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X