Ram Charan 15 వ సినిమాతో భారీ మోసం.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు టీమ్!
రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న RC 15వ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ పనుల్లో చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా ఉండగా మరొక వైపు ఈ సినిమా పేరుతో ఒక మోసం జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ స్పందించి అందరికీ వివరణ ఇచ్చారు.

దిల్ రాజు 50వ సినిమా
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సినిమా కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 50వ సినిమా RC15. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే సినిమాకు సంబంధించిన చిన్న ఫోటో లీకైన కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

లీక్ కావద్దని..
అయితే సినిమాకు సంబంధించిన సన్నివేశాలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో తరచుగా లీక్ అవుతూ ఉండడంతో చిత్ర యూనిట్ ఆ విషయంపై చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకుంది. ఎక్కడ కూడా ఒక ఫోటో కూడా లీక్ కావొద్దు అని దర్శకుడు శంకర్ తన ప్రతి సినిమా విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక ఎవరైనా అలా ఫోటోలను లీక్ చేస్తే చట్టపరమైన ఇబ్బందులు చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు చేశారు.

ఆసక్తికరమైన లీక్స్
అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లుక్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో మూడో విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడు అని సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు. ఇక రామ్ చరణ్ డబుల్ యాక్షన్ లో కనిపించబోతున్నాడు అని కూడా ఆ మధ్య ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

RC 15 సినిమాతో మోసం
అయితే ఇటీవల RC 15వ సినిమా పేరుతో జరుగుతున్న ఒక మోసం గురించి చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా కోసం క్యాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు అని రామ్ చరణ్ 15 సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని కొంతమంది మాయమాటలు చెబుతున్నారు అనే విషయం చిత్ర యూనిట్ సభ్యులకు తెలిసింది. దీంతో వెంటనే అందులో ఎలాంటి నిజం లేదు అని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

పూర్తిగా ఫేక్ న్యూస్
పూర్తిగా ఫేక్ న్యూస్


Click it and Unblock the Notifications











