G20 summit శ్రీనగర్‌లో దిల్ రాజుకు భారీ స్వాగతం.. కేంద్రమంత్రితో కలిసి G20 సదస్సుకు హాజరు
దేశంలోని టూరిజం విభాగాన్ని, పర్యాటక ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా జమ్ము, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్‌కు అనూహ్యమైన స్పందన కనిపిస్తున్నది. దేశంలోని పారిశ్రామికవేత్తలు, సినీ రంగానికి చెందిన ప్రముఖులతోపాటు విదేశాల్లోని పలు సంస్థలు ఈ సదస్సులో భాగమయ్యాయి. మే 22 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 24వ తేదీ వరకు నిర్వహించే ఈ సమావేశంలో తెలుగు సినిమా పరిశ్రమను ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ జాబితాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొనడం ఆలస్యంగా బయటకు వచ్చింది. జీ20లో దిల్ రాజు పాల్గొన్న వివరాల్లోకి వెళితే..
2019లో జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించిన తర్వాత ఇలాంటి భారీ సదస్సు జరగడం ఇదే తొలిసారి. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్, నిఘా వర్గాల రిపోర్టుల నేపథ్యంలో ఈ వేడుకకు మూడంచెల కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.

టాలీవుడ్ నుంచి జీ20 టూరిజం డెవలప్‌మెంట్ సదస్సుకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ సోమవారం ఉదయమే హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి శ్రీనగర్ చేరుకొన్న ఆయనకు కశ్మీర్ సంప్రదాయ పద్దతుల్లో స్వాగతం పలికారు. తలకు పాగా చుట్టి సాదరంగా ఆహ్వానించారు.
అయితే శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 టూరిజం సదస్సులో పాల్గొనేందుకు నిర్మాత దిల్ రాజు అక్కడికి చేరుకొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి దిల్ రాజు శ్రీనగర్ చేుకొన్నారు. దిల్ రాజుకు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్థానిక సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం లభించింది. నుదుట తిలకం దిద్ది, తలకు పాగా చుట్టి ఆహ్వానించారు.
జీ20 టూరిజం సదస్సుకు హాజరైన వార్తను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. మా నిర్మాత దిల్ రాజు జీ 20 సదస్సులో పాల్గొంటున్నారు అని ట్వీట్‌లో తెలిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దిల్ రాజు, స్థానిక నాయకులతో కూడిన ఫోటోను షేర్ చేశారు.దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











