దిల్ రాజు చేతికి ఎన్టీఆర్ మూవీ.. టాలీవుడ్ హిస్టరీలోనే తొలిసారి ఇలా రిలీజ్

కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పాత సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్ కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేకమైన రోజుల్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు మరికొన్ని సినిమాలు అదే దారిలో రాబోతున్నారు. అందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను సూపర్ స్టార్‌గా మార్చిన 'సింహాద్రి' మూవీ ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'సింహాద్రి' మూవీని మే 20వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు దీని కోసం తగు ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా హడావిడే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే పెద్ద స్క్రీన్ ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ఐమాక్స్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. గతంలో ఏ సినిమా కూడా అక్కడ రీ రిలీజ్ అవలేదు. దీంతో సింహాద్రి మూవీ రికార్డు నమోదు చేసింది.

Dil Raju To Release Simhadri Movie in Nizam and Vizag Areas

'సింహాద్రి' రీ రిలీజ్‌ను పండుగలా జరుపుకోవాలని భావిస్తోన్న నందమూరి అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చారు. ఆయన నైజాం, వైజాగ్ ఏరియాల్లో ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. రీ రిలీజ్‌లు మొదలైన తర్వాత బడా నిర్మాత సినిమాను రిలీజ్ చేయడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. ఇక, ఈ ప్రొడ్యూసర్ రాకతో 'సింహాద్రి' మూవీకి అత్యధిక థియేటర్లు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

Dil Raju To Release Simhadri Movie in Nizam and Vizag Areas

ఇదిలా ఉండగా.. ఇప్పటికే 'సింహాద్రి' మూవీకి సంబంధించిన రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఏరియాల్లో ప్రారంభం అయిపోయాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ఏకంగా 4000 ఆస్ట్రేలియన్ డాలర్లకు పైగానే వసూలు చేసింది. తద్వారా ఈ మార్కు చేరిన మొదటి రీ రిలీజ్ చిత్రంగా రికార్డు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X