పెద్ద హీరోలను దూరం పెడుతున్న దిల్ రాజు.. సరికొత్త ప్లాన్
దిల్, ఆర్య, కొత్త బంగారు లోకం వంటి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందినవే. ఆ సినిమాలతో రాజు గారి బ్రాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక బొమ్మరిల్లు లాంటి సినిమాకు కూడా చాలా తక్కువ ఖర్చు పెట్టిన ఆయన పెట్టుబడికి పదింతల లాభాన్ని అందుకున్నాడు. ఇక అవకాశం వచ్చినా ప్రతిసారి పెద్ద హోరోలతో కూడా కమర్షియల్ యాంగిల్ లో పెద్ద సినిమాలను నిర్మిస్తున్నారు.
అయితే దిల్ రాజుకు ఎక్కువగా లాభాలను అందించింది మాత్రం చిన్న సినిమాలనే చెప్పాలి. ఆ మధ్య వచ్చిన శతమనం భవతి కూడా అలాంటిదే. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్న ఆయన F3ని కూడా స్టార్ట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ తో ఐకాన్ అనే సినిమాను కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అయితే దిల్ రాజు ఇక నుంచి స్టార్ హీరోల సినిమాలు కొన్నాళ్ళు పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది.

వీలైనంత వరకు చిన్న బడ్జెట్ లోనే మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించాలని అనుకుంటున్నారట. అందుకే సంబంధించిన టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వైరల్ గా మారింది. తన సినిమాలకు ఎప్పటి నుంచో అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వర్క్ చేసుకుంటూ వస్తున్న యువ దర్శకులకు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ సినిమాలతో దిల్ రాజు ఎంతవరకు లాభాలను అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











