Anil Ravipudi: అనిల్ రావిపూడికి దిల్ రాజు క్రేజీ ఆఫర్.. కానీ,

టాలీవుడ్‌లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆఫర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనిల్‌ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటీ? దిల్ రాజ్ ప్యూచర్ ప్లాన్ ఏంటీ? ఎందుకు ఆ ఆఫర్ ను అనిల్ రావిపూడి తిరస్కరించారు?

హైదరాబాద్‌లో జరిగిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్‌లో భారీ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడిగా సూపర్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడిని హీరోగా లాంచ్ చేస్తానని దిల్ రాజు ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Dil Raju s Big Offer to Anil Ravipudi Rejected Sparks Buzz in Tollywood

ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ, అనిల్ రావిపూడిలో మంచి నటుడు ఉన్నాడని, కథ చెబుతున్నప్పుడు ప్రతి పాత్రలో జీవించి చూపించే అతని నైపుణ్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని తెలిపారు. "హీరో అంటే యాక్టర్... ఆ అర్ధంలో అనిల్‌లో పూర్తి స్థాయి హీరో క్వాలిటీ ఉంది. సరైన సమయం వస్తే నేనే అతన్ని హీరోగా పరిచయం చేస్తా" అని ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేశారు.

అయితే ఈ ఆఫర్‌పై అనిల్ రావిపూడి తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం తాను నటన వైపు వెళ్లే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు. 'దిల్ రాజు గారి ఆఫర్ బాగుంది. కానీ నేను ఇప్పుడు డైరెక్షన్‌పైనే ఫోకస్ చేస్తున్నాను. ఆయన నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా సినిమా చేస్తే నేను డైరెక్ట్ చేస్తాను'అంటూ చమత్కరించారు. దీంతో ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

ఇదే వేదికపై అనిల్ తన తదుపరి మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు. విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోందని అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లకు ఇదే ఫుల్ స్టాప్ అని తెలిపారు.

ఇక 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సినిమా గురించి మాట్లాడుతూ, హీరో ప్రదీప్ రంగనాథన్‌పై అనిల్ ప్రశంసలు కురిపించారు. 'ప్రదీప్ హీరోలా కాకుండా మనలో ఒకడిలా కనిపిస్తాడు. అందుకే ప్రేక్షకులు అతన్ని ఇంతగా ఆదరిస్తున్నారు' అని చెప్పారు. అలాగే దర్శకుడు విఘ్నేశ్ శివన్, నిర్మాత నయనతార గురించి కూడా ప్రశంసలు వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీలో ప్రస్తుతం మరో కోణంలో కూడా ఈ వ్యవహారం చర్చకు వస్తోంది. అనిల్ రావిపూడి వరుస హిట్స్‌తో టాప్ ఫామ్‌లో ఉండగా, దిల్ రాజు ఇటీవల కొంత వెనుకబడ్డారని టాక్ ఉంది. స్టార్ హీరోల కొరత, డిస్ట్రిబ్యూషన్‌లో తగ్గిన ప్రభావం వంటి అంశాల నేపథ్యంలో, అనిల్ సక్సెస్ ట్రాక్‌ను ఉపయోగించుకోవాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అనిల్ రావిపూడి మాత్రం చాలా క్లియర్‌గా తన దారిని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

అనిల్ రావిపూడి .. తన తదుపరి మల్టి స్టారర్ సినిమాను షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ వంటి బ్యానర్లతో, జీ సంస్థ భాగస్వామ్యంతో రూపొందిస్తున్నాడు. దీంతో ఆయన ప్రస్తుతం దర్శకుడిగానే తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగించాలనే నిర్ణయంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇలాదిల్ రాజు చేసిన బంపర్ ఆఫర్, అనిల్ రావిపూడి ఇచ్చిన స్మార్ట్ రిప్లై - ఈ రెండు కలిసి టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసాయి. భవిష్యత్తులో అనిల్ నిజంగా హీరోగా ఎంట్రీ ఇస్తాడా? లేక దర్శకుడిగానే తన సక్సెస్‌ను కొనసాగిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X