క్షీణించిన దిల్ రాజు తల్లి ఆరోగ్యం .. ఐటీ అధికారుల కంట్రోల్‌లో కుటుంబ సభ్యులు!
తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖుల నివాసాలపై ఆదాయపు పన్ను అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా టాప్ ప్రొడ్యూసర్ ఇండ్లపై మెరుపు దాడులు నిర్వహిస్తూ పలు ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రశ్నలు సంధిస్తున్నట్టు సమాచారం. అయితే ముఖ్యంగా దిల్ రాజు నివాసం, అలాగే ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇండ్లపై భారీగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలొ దిల్ రాజు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురువుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన తల్లి ఆరోగ్యం కూడా విషమించడంతో ఫ్యామిలీ మెంబర్స్ మరింత ఒత్తిడికి లోనయ్యారనేది మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాత, అలాగే ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ సంక్రాంతి పండుగకు మూడు భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ సినిమాతోపాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాను స్వీయ నిర్మాణంలో రూపొందించారు. ఇక డాకు మహారాజ్ సినిమాను ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం తెలిసిందే. అయితే సంక్రాంతి బరిలో ఆయనవే మూడు సినిమాలు కావడం.. మూడు చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద భారీగా స్పందన రావడం తెలిసిందే.

అయితే గేమ్ ఛేంజర్ సినిమా కలెక్షన్ల విషయంలో అనేక ఊహాగానాలు మీడియాలో వినిపించాయి. అయితే ఆ సినిమాకు సంబంధించిన వసూళ్లను అధికంగా చూపించారనే విషయంపై ట్రోల్స్ భారీగానే జరిగాయి. అయితే ఈ వివాదంపై దిల్ రాజు వర్గీయులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు లెక్కలు తేల్చడానికి మెరుపుదాడులు నిర్వహించారనే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
గత మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులకు దిల్ రాజు కుటుంబ సభ్యులు పూర్తిగా సహకారం అందిస్తున్నారనేది మీడియాలో వినపడుతున్న విషయం. ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకొని బ్యాంక్ లాకర్లు తెరిపించడం కూడా అధికారులు చేయించారు. ప్రతీ ఆర్థిక లావాదేవీలపై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ప్ నిర్వాహకులు వివరణ ఇస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, దిల్ రాజు తల్లి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారనేది తాజా సమాచారం.

అయితే దిల్ రాజ్ తల్లి ఆరోగ్యం క్షీణించడంతో హస్పిటల్‌లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఐటీ అధికారులు తొలుత కుటుంబ సభ్యులను బయటకు వెళ్లడానికి అంగీకరించలేదని, ఆ తర్వాత పరిస్థితి గ్రహించి అనుమతి ఇచ్చారంటూ వార్తలు మీడియాలో వచ్చాయి. దాంతో దిల్ రాజు తన తల్లిని హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ ప్రస్తుతం హాస్పిటల్‌కు వెళ్లినట్టు తెలిసింది.
అయితే ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా అధికారులు కఠిన చర్యలు తీసుకొంటున్నారు. హాస్పిటల్‌కు వెళ్లిన దిల్ రాజు కుటుంబ సభ్యులకు ఎస్కార్డ్‌గా కొందరు మహిళా అధికారులను, మరింత అఫీషియల్స్‌ను వెంట పంపించి వారి కదలికలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా 230 కోట్ల రూపాయలకుపైగా రికార్డు కలెక్షన్లను సాధించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జరుగుతున్న సక్సెస్ మీట్‌కు దిల్ రాజు గైర్హాజరు అయ్యారు.


Click it and Unblock the Notifications











