'డిస్కోరాజా' అప్‌డేట్: ఢిల్లీవాలా.. దుమ్ము దులిపేయనున్న మాస్ మహారాజ్

వీఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా 'డిస్కోరాజా' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమా తెరకెక్కుతోంది.

గత కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమౌతున్న రవితేజ ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో ఉన్నాడు. ఈ మేరకు 'డిస్కోరాజా' పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్య హోప్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం తుది దశ షూటింగ్ జరుపుకుంటోంది.

Dilliwala Song From Ravi Tejas Disco Raja

చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇక ఈ చిత్రం నుంచి 'ఢిల్లీవాలా..' అనే మరో పాటను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్ సభ్యులు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'డిస్కోరాజా' సినిమాను జనవరి 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి. బాబీ సింహా, వెన్నెల కిషోర్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాపై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఆ అంచనాలను డిస్కో రాజా ఏ రేంజ్ అందుకుంటాడా అనేది!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X