NBK107: బాలయ్య సినిమాలో బెజవాడ బ్యూటీ.. స్పెషల్ సాంగ్ కోసం రచ్చ షురూ

బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, అన్నింటికీ మించి డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అయితే, చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది విడుదలైన 'అఖండ' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. అదే సమయంలో భారీ కలెక్షన్లను రాబట్టి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' మూవీతో భారీ సక్సెస్‌ను అందుకున్న జోష్‌తో ఉన్న నందమూరి బాలకృష్ణ.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను అంతే ఉత్సాహంగా లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే 'క్రాక్'తో బిగ్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ బాలయ్య కోసం రియాలిటీతో కూడిన ఓ పవర్‌ఫుల్ స్టోరీని రెడీ చేశాడట. అంతేకాదు, ఈ సినిమా పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

Dimple Hayathi Special Song in Balakrishna and Gopichand Movie

వాస్తవానికి 'ఆఖండ' మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఈ సినిమాను మొదలు పెడతారని ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ, బాలయ్యకు సర్జరీ జరగడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా దీన్ని అనుకున్న సమయానికి మొదలు పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం అయింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల పట్టణంలో దీన్ని మొదలు పెట్టి అప్పటి నుంచి పలు ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకు షూట్‌ను కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నరని తెలుస్తోంది.

గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కాంబోలో రాబోతున్న మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో బెజవాడ బ్యూటీ డింపుల్ హయాతి (ఖిలాడీ ఫేం) ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుతున్నారని తెలుస్తోంది. దీన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య సారథ్యంలో చిత్రీకరిస్తున్నారట. ఇందులో డింపుల్‌తో పాటు బాలయ్య అదిరిపోయే స్టెప్పులతో అలరించబోతున్నారని తెలిసింది. దీంతో ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్‌పై అందరిలోనూ ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తోంది. అలాగే, ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అలాగే, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. రిషి పంజాబీ దీనికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X