బాలకృష్ణ వీడియోతో డింపుల్ హయాతి షాకింగ్ ట్వీట్.. పోలీసులకు స్ట్రాంగ్ కౌంటర్?
సూపర్ హిట్టు నీ హైటు అంటూ తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ పాపులర్ అయిన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి. గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ తో ఫేమస్ అయిన డస్కీ బ్యూటీ డింపుల్ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇటీవలే రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సుందరి. అయితే ఈ మధ్య ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో చోటు చేసుకున్న వివాదం కారణంగా మరింతగా హైలెట్ అయింది డింపుల్. ఈ నేపథ్యంలో డింపుల్ తాజాగా షేర్ చేసిన బాలకృష్ణ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.
స్పెషల్ సాంగ్స్: విజయవాడకు చెందిన ముద్దుగుమ్మ డింపుల్ హయాతి నటిగా 'గల్ఫ్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత ప్రభుదేవా, తమన్నా నటించిన 'అభినేత్రి 2'లో కీలక పాత్ర చేసింది. అయితే ఈ సినిమాలు ఏవి డింపుల్ కు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. దీంతో ఆమె పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.

హీరోయిన్ గా: అందులో భాగంగానే వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ మూవీలో సూపర్ హిట్టు అంటూ చెలరేగిపోయి డ్యాన్స్ చేసింది బ్యూటిఫుల్ డింపుల్ హయాతి. ఇందులో ఆమె హావాభావాలకు, స్టెప్పులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో డింపుల్ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది. తర్వాత కొంతకాలానికి హీరోయిన్ గా తెలుగులో సినిమాలు చేసింది.
ప్లాప్-నిరాశ: రవితేజ ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయాతికి మంచి పేరే దక్కింది. ఇందులో అదిరిపోయే అందాలను హాట్ గా ఎక్స్ పోజ్ చేసి ఆకర్షించింది. ఇటీవలే గోపీచంద్ సరసన నటించిన ఈ డస్కీ సుందరి రామబాణం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా ప్లాప్ కావడంతో డింపుల్ కు నిరాశ ఎదురైంది.

ఇబ్బందులకు: ఇక డింపుల్ సినీ పర్సనల్ విషయాల్లోకి వెళితే.. ఇటీవలే ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో ఆమెకు గొడవ జరిగిన విషయం తెలిసిందే. అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్ విషయంలో వీరిద్దరి మధ్య చోటుచేసుకొన్న గొడవ రకరకాల మలుపు తిరిగింది. విధులకు ఆటంకం కలిగించే విధంగా తన కారుకు అడ్డంగా పార్కింగ్ చేసి.. ఇబ్బందులకు గురి చేస్తుందన్న ఆరోపణలతో డింపుల్ పై డీసీపీ కేసు నమోద్ చేశారు.
లాయర్ వ్యాఖ్యలు: డీసీపీ రాహుల్ హెగ్డే కేసు నమోదు తర్వాత తనపై తప్పుడు కేసు బనాయించారని ఆరోపిస్తూ హీరోయిన్ డింపుల్ కూడా కేసు పెట్టిన పోలీసులు తీసుకోలేదు. ఈ విషయంలో డింపుల్ తప్పు ఏం లేదని, పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని హీరోయిన్ లాయర్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సంఘటన నుంచి పోలీసులపై పలు రకాలుగా ట్వీట్లు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

బాలయ్య వీడియోతో:తాజాగా సోషల్ మీడియాలో మరొక ట్వీట్ చేసింది డింపుల్ హయాతి. ఈ వీడియోలో బాలయ్య డైలాగ్ తో పోలీసులకు గట్టి కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సింహా సినిమాలోని అన్యాయం జరిగినప్పుడు పోలీసులు ఎక్కడా అంటూ వార్నింగ్ ఇచ్చే వీడియోను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రజంట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











