AGENT: అఖిల్ సినిమాలో ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్.. సర్‌ప్రైజ్ చేసే పాత్రలో!

అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘ కాలం పాటు కష్టనష్టాలను అనుభవించిన తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కాడు హ్యాండ్సమ్ హంక్ అక్కినేని అఖిల్. చిన్న వయసులోనే 'సిసింద్రీ' అనే సినిమాలో మెరిసిన అతడు.. కొన్నేళ్ల క్రితమే 'అఖిల్' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ, ఇది అఖిల్‌కు గ్రాండ్ ఎంట్రీని ఇవ్వలేదు. పైగా టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీలలో ఒకటిగా మిగిలిపోయింది. అఖిల్ ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' చేసినా ఇవి కూడా అతడికి నిరాశనే మిగిల్చాయి. దీంతో అతడి కెరీర్ అర్థాంతరంగా ముగుస్తుందేమో అని అక్కినేని కుటుంబ అభిమానులు అందరూ భయపడిపోయారు.

సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చినా అఖిల్‌కు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో గత ఏడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశల నడుమ భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీతో అతడు తొలిసారి విజయాల బాట పట్టాడు. దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. మంచి స్పందనతో రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో రూ. 4 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి. ఈ ఉత్సాహంతోనే అఖిల్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు.

Dino Morea Key Role in Akhil Akkineni Agent Movie

అక్కినేని అఖిల్ ప్రస్తుతం 'ఏజెంట్' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ గత ఏడాది ప్రారంభం అయింది. కానీ, షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌ను ఇటీవలే పున: ప్రారంభించారు. దీంతో అంతా సవ్యంగానే అవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. మళ్లీ నిర్మాతల బంద్ కారణంగా ఈ మూవీ చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

అఖిల్ హీరోగా నటిస్తోన్న 'ఏజెంట్' మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. అందుకే ఇందులో పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రను చేస్తున్నారు. ఇక, ఇప్పుడు బాలీవుడ్‌లో యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా సుపరిచితుడు అయిన డినో మోరియాను కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని తెలిసింది. అతడు ఇందులో చేసే రోల్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని కూడా ఓ న్యూస్ లీకైంది. ఇప్పటికే ఈ స్టార్ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడని బీ టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'ఏజెంట్' మూవీ విదేశీ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోందట. ఇందులో ఈ యంగ్ హీరో రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్‌ విషయంలోనూ వైవిధ్యాన్ని చూపించేందుకు బల్క్ బాడీతో రెడీ అయ్యాడు. ఇక, ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X