Agent: అఖిల్ మూవీలో ‘గాడ్’గా ప్రొడ్యూసర్.. బాబోయ్ ఇలా ఉన్నాడేంటి!
చిన్న వయసులోనే 'సిసింద్రీ'గా మెప్పించి.. 'అఖిల్' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. కానీ, ఇది అతడికి గ్రాండ్ ఎంట్రీని అందించలేదు. పైగా టాలీవుడ్‌లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీలలో ఒకటిగా మిగిలింది. అఖిల్ ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' చేసినా ఇవి కూడా అతడికి నిరాశనే మిగిల్చాయి. దీంతో అతడి కెరీర్ అర్థాంతరంగా ముగుస్తుందేమో అని అక్కినేని కుటుంబ అభిమానులు అందరూ భయపడిపోయారు. ఈ పరిస్థితుల్లోనే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీతో ఫస్ట్ హిట్‌ను అందుకున్నాడు.
మొదటి భారీ విజయం తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న అక్కినేని అఖిల్... ఆ వెంటనే 'ఏజెంట్' అనే పాన్ ఇండియా చిత్రాన్ని కూడా ప్రారంభించేశాడు. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ స్టోరీతో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అయితే, మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడిపోయింది. దీంతో అసలు ఇది మొత్తానికే ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. కానీ, దీన్ని ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నారు.

అఖిల్ హీరోగా నటిస్తోన్న 'ఏజెంట్' మూవీని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. అందుకే ఇందులో పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులను తీసుకున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రను చేస్తున్నారు. ఇక, ఇప్పుడు బాలీవుడ్‌లో యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా సుపరిచితుడు అయిన డినో మోరియా ఇందులో 'ది గాడ్' అనే పాత్రను చేస్తున్నాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో డినో భయంకరమైన గెటప్‌లో దర్శనమిచ్చాడు. దీంతో ఈ రోల్‌పై ఆసక్తి పెరిగిపోయింది.

'ఏజెంట్' మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించాడు. హిప్‌హాప్ తమీజా మ్యూజిక్ అందించాడు.


Click it and Unblock the Notifications











