నరేంద్ర మోదీతో రామాయణం సీత.. పక్కనే అద్వానీ.. వైరల్‌గా ఫోటో

కరోనా లాక్‌డౌన్ కారణంగా రామాయణం సీరియల్ దూరదర్శన్‌లో పున: ప్రసారం కావడంతో అందులో రాముడు, సీతగా నటించిన అరుణ్ గోవిల్, దీపికా చికిలియా పేర్లు మళ్లీ ఈ తరం వారికి పరిచయం అయ్యాయి. రామాయణం సీరియల్‌కు మరోసారి విశేష ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని. అప్పటి బీజేపీ నేత నరేంద్రమోదీతో దీపికా చికిలియా కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు మీడియాలో వైరల్ అయింది.

రామాయణం అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో దీపికాను బరోడా లోక్‌సభ స్తానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆ సమయంలో అంటే 1991లో అప్పటి ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీతోపాటు ప్రచారంలో దిగిన ఫోటోను దీపిక తాజాగా షేర్ చేసింది.

Dipika Chikhlia photograph with Narendra modi goes viral

బరోడా నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఫోటో ఇది. నాతోపాటు ఎల్‌కే అద్వానీ, నరేంద్రమోడీ ఇద్దరు ఉన్నారు. అప్పుడు నళిన్ భట్ బరోడా ఎన్నికల ఇంచార్జిగా పనిచేశారు. ఆయనను కూడా ఈ ఫోటోలో చూడవచ్చు అంటూ దిపికా ట్వీట్ చేశారు. దీపికా ఫోటో షేర్ చేసిన వెంటనే ఆమె అభిమాని మరో ఫోటోను షేర్ చేశారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌తో కలిసి దీపిక నడుస్తున్న ఫోటోను షేర్ చేశారు.

ప్రస్తుతం రామాయణం సీరియల్ డీడీ నేషనల్‌లో ఉదయం 9 గంటలకు ఓసారి.. రాత్రి 9 గంటలకు మరోసారి ప్రసారం అవుతున్నది. రామానంద సాగర్ రూపొందించిన ఈ సీరియల్‌లో సీతగా దీపిక, రాముడిగా అరుణ్ గోవిల్, లక్ష్మణుడిగా సునీల్ లహ్రీ నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X