రాధేశ్యామ్ సినిమాకు కళ్ళు చెదిరే ఓటీటీ ఆఫర్స్.. ఒప్పుకుంటే జాక్ పాట్ కొట్టినట్లే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరోసారి తీవ్ర సంక్షోభం నెలకొనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కరోనా దెబ్బతో మళ్ళీ ఎప్పటిలానే సినిమాలు రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. ఫస్ట్ వేవ్ మొదలైనప్పుడు చాలా వరకు పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ ఓమిక్రాన్ వేరియెంట్ ఊపందుకోవడంతో చాలా సినిమాలు డిజిటల్ ప్రపంచంలోకి వెళ్ళి పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాకు కూడా ఓటీటీ ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. కానీ నిర్మాతలు మాత్రం ఇంకా ఆ ఆఫర్స్ పై చర్చించలేదు.

చాలా గ్యాప్ తీసుకొని
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా తప్పకుండా బిగ్ స్క్రీన్ పై ఒక విజువల్ వండర్ తరహాలో ఉంటుంది అని చెబుతున్నారు. ప్రభాస్ బాహుబలి సాహో సినిమాలో అనంతరం చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం ఇది. ఎమోషనల్ లవ్ జర్నీ గా కొనసాగే సినిమా చాలా అందంగా ఉంటుంది అని దర్శకుడు ఇదివరకే చాలా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని కూడా చెబుతున్నారు. సినిమా ట్రైలర్ కూడా అభిమానుల అంచనాల స్థాయిలు ఒక్కసారిగా పెంచేసింది.

రాధేశ్యామ్ సస్పెన్స్..
అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ దెబ్బతో చాలా వరకు పెద్ద సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే RRR సినిమా సమ్మర్లో కి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు వెండితెరపైకి వస్తుందో తెలియదు. కానీ ఎలాగైనా బిగ్ స్క్రీన్ పైన సినిమాని విడుదల చేయాలని రాజమౌళి పర్ఫెక్ట్ క్లారిటీతో ఉన్నారు. ఇక రాధేశ్యామ్ విడుదలపై కూడా ప్రస్తుతం సస్పెన్స్ అయితే గట్టిగానే కొనసాగుతోంది. సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేస్తారా లేదా అనే విషయంలో అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి.

ఫైట్ సీన్స్ లేకపోయినప్పటికీ
రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాలో టైమ్ ట్రావెలింగ్ కు సంబంధించిన అంశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. సినిమా ట్రైలర్ లో కూడా అదే విషయాన్ని హైలెట్ చేశారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. సినిమాలో పెద్దగా ఫైట్ సీన్స్ లేకపోయినప్పటికీ లవ్ జర్నీ తో సినిమా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అని చెబుతున్నారు.

ఓటీటీ ఆఫర్స్
ఇక సినిమా వాయిదా పడుతుందా లేదా విషయంలో చాలా రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ దర్శకుడు అలాగే ఈ చిత్ర యూనిట్ సభ్యులు కూడా సోషల్ మీడియా ద్వారా సినిమా జనవరి 14 రాబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఒకవేళ పరిస్థితులు మారితే కనుక ఓటీటీలో రిలీజ్ చేసుకుంటారా అనేది కూడా చర్చల్లోకి వస్తుంది. కొన్ని ఓటీటీ సంస్థలు అయితే ఆఫర్స్ గట్టిగానే ఇస్తున్నట్లు సమాచారం.

ఓటీటీ డీల్ 350కోట్లు?
రాధేశ్యామ్ సినిమా మార్కెట్ కు తగ్గట్టుగానే దాదాపు 300 కోట్ల వరకు కూడా కొన్ని ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్నట్లు గా తెలుస్తోంది. మళ్లీ చర్చలు కొనసాగిస్తే ఆ లెక్క 350 కోట్ల వరకు వెళ్లే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తే ఆ స్థాయిలో బ్రేక్ ఈవెన్ అందుకోవడం అంటే చాలా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో అలాగే మహారాష్ట్ర ఒడిసా వంటి ప్రాంతాల్లో థియేటర్స్ నడవడం చాలా కష్టంగానే ఉంది. చాలా ప్రాంతాల్లో థియేటర్స్ క్లోజ్ చేశారు. కాబట్టి రాధేశ్యామ్ నిర్మాతలు ఓటీటీ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారు లేదో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











