NBK109: బాలకృష్ణ సినిమా వేరే లెవెల్‌లో.. డైరెక్టర్ బాబీ అదిరిపోయే అప్‌డేట్!

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ... గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్నారు బాలయ్య బాబు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు కల్గిన ఆయన వరుసగా చిత్రాలు చేస్తూ రచ్చ చేస్తున్నారు. హిట్టుల మీద హిట్లు కొడుతూ అందరినీ తెగ అలరిస్తున్నారు. ముఖ్యంగా మాస్ చిత్రాల్లో నటిస్తూ... అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈయన ఎవరూ ఊహించని స్థాయిలో దూసుకెళ్తున్నారు.

అయితే తాజాగా బాలకృష్ణ మరో అద్భుతమైన సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ బాబీతో కలిసి చేయబోతున్న ఈ సినిమాకు NBK 109 అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు చాలా రోజుల క్రితమే పూర్తి కాగా.. రెగ్యులర్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. భగవంత్ కేసరి హిట్ ను కాస్త ఎంజాయ్ చేయగానే.. వెంటనే ఈ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా మారిపోయాడు బాలకృష్ణ. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదల కాగా.. మరింత క్యూరియాసిటీ పెరిగింది అభిమానుల్లో.

Directo Bobby Shocking Updates Leaked in In Nandamuri Balakrishna Next Movie NBK109

డైరెక్టర్ బాబీ కూడా ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా సినిమాను ఆవిష్కరించే పనిలో పడ్డారు. ఇప్పటికే వరుస హిట్లు కొడుతుండడంతో ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకు తగ్గట్లుగానే నటీనటుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్ బాబీ. ముఖ్యంగా ఈ సినిమాలో త్రిష, మీనాక్షి చౌదరిలను ఫిక్స్ చేశారని ఓ న్యూస్ వైరల్ అయింది. కానీ ఈ చిత్రంలో ఎవరు బాలయ్య బాబు సరసన కనిపించబోతున్నారో కన్ఫార్మ్ గా తెలియదు.

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా డైరెక్టర్ బాబీ షాకింగ్ విషయాలు తెలిపారు. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్ డేట్లు ఇచ్చి బాలయ్య బాబు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. అయితే ఈయన ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Directo Bobby Shocking Updates Leaked in In Nandamuri Balakrishna Next Movie NBK109

NBK 109 సినిమా వేరే లెవెల్ లో వస్తుందని... డైరెక్టర్ బాబీ తెలిపాడు. అలాగే ఇప్పటికే సాలిడ్ వైలెంట్ యాక్షన్ షెడ్యూల్ ను ఊటీలో పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఆ తర్వాత చేయబోయే షెడ్యూల్ ను రాజస్థాన్ లో నిర్వహించబోతున్నామని కూడా వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ వార్త చూస్తున్న చాలా మంది ఈ మాత్రం హింట్ ఇచ్చారు చాలా బాబూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X