చిరంజీవి దుర్మార్గుడు.. గులాబీ సినిమా హీరో షాకింగ్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఆయనకు తిరుగులేదు. చిత్రపరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఎవరికి ఏ ఆపద వచ్చిన చిరంజీవి ముందు నిలుస్తారు. ఇప్పటివరకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారెవరూ లేరు. కానీ, అప్పుడప్పుడు కొంతమంది పెయిడ్ బ్యాచ్ గాళ్లు ఆయనపై కామెంట్స్ చేస్తుంటారు. లేని లేని రూమార్స్ క్రియేట్ చేస్తుంటారు. చిరంజీవిపై చెత్త చెత్త వార్తలు వస్తే.. మెగా ఫ్యాన్స్ అస్సలూ ఊరుకోరు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ స్టార్ హీరో చిరంజీవిపై షాకింగ్ కామెంట్లు చేశారు.చిరంజీవి పెద్ద దుర్మార్గుడు.. రాక్షసుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ హీరో ఎవరంటే?

ఆ హీరో ఎవరో కాదు జేడీ చక్రవర్తి. దర్శకుడిగా, నటుడిగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు జేడీ చక్రవర్తి. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ తొలి సినిమా శివ తో నటుడిగా పరిచయమయ్యారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో జేడీ చక్రవర్తికి ఇండస్ట్రీలో తిరుగులేకుండా పోయింది. తర్వాత ఆయనకు తెలుగుతో పాటు తమిళం, హిందీలో చాన్స్‌లు వచ్చాయి. కొన్నాళ్లపాటు జేడీ విలన్‌గా నటించి మెప్పించారు. వన్ బై టూ, మనీ మనీ,గులాబీ చిత్రాలతో హీరోగా పేరు దక్కించుకున్నారు. తర్వాత వచ్చిన మృగం, దెయ్యం, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా, సత్య, ప్రేమకు వేళాయెరా, హరిశ్చంద్ర,కోదండ రాముడు, పాపే నా ప్రాణం, మా పెళ్ళికి రండి, అక్కా బావెక్కడ, నవ్వుతూ బతకాలిరా, సూరి, ప్రేమకు స్వాగతం, గోల్‌మాల్, కాశి, మధ్యాహ్నం హత్య, దుబాయ్ శీను, మనీ మనీ మోర్ మనీ, ఆల్ ది బెస్ట్ చిత్రాలతో మరిన్ని విజయాలు అందుకున్నారు.

Director Actor JD Chakravarthy made shocking comments on Megastar Chiranjeevi

ఇక పోతే జేడీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తుంటారు. తాజాగా ఈ నటుడు ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ మెగాస్టార్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. సినిమాపై ఏళ్ల తరబడి కఠోర శ్రమ, అంకితభావం ఆయనను అందరూ మెచ్చే మెగాస్టార్‌గా మార్చాయని కొనియాడారు. చిరంజీవి దుర్మార్గుడని అన్నారు. ఎందుకంటే ఘరానా మొగుడు అనే చిత్రానికి జేడీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పుడు క్లైమాక్స్‌లో చిరంజీవి ఎనిమిది రోజులు అంబాసిడర్ కారులో పడుకున్నారని వెల్లడించారు. ఫైటర్స్ మారుతున్నారు, యూనిట్ మారింది కానీ హీరో మారట్లేదు. జేడీ చక్రవర్తి చూసి చూసి మెగాస్టార్ దగ్గరకు వెళ్లి.. ఏంటి లోపల మేకప్ రూంలో పడుకోవచ్చు కదా? అని అడిగానని అన్నారు.

దానికి చిరంజీవి బదులిస్తూ చాలా గొప్ప లాజిక్ చెప్పారని ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. 'ఒకవేళ నేను లోపల పడుకున్నానుకోండి ఎవరూ లేపరు.బయట కారులో పడుకుంటే ఒకే రెడీ యాక్షన్.. చిరంజీవిని పిలవండి అని లేచి వెళ్లిపోవచ్చు'. అని జేడీ ఇంటర్వ్యూలో చెప్పారు. పక్కవారికి ఆ చాన్స్ కూడా ఇవ్వడు. కాగా ఆయన పెద్ద రాక్షసుడు అంటూ చిరు గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. వివరించారు.

Director Actor JD Chakravarthy made shocking comments on Megastar Chiranjeevi

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. 70 ఏళ్లు దగ్గరగా వస్తోన్న ఇప్పటికీ ఈ హీరో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. కానీ చివరగా తెరకెక్కిన భోళా శంకర్ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద నెగిటివ్ టాక్ దక్కించుకుంది. అంతంత మాత్రాన ఆడింది. టాలీవుడ్‌లోనే ప్రముఖ హీరోగా కొనసాగుతోన్న చిరు ఇటీవలే ఓ యాడ్ కూడా చేశారు. కంట్రీ డిలైట్ అనే పాల యాడ్‌లో డ్యుయల్ రోల్‌లో నటించారు.ఈ యాడ్‌లో కమెడియన్ సత్య కూడా నటించడం విశేషం. ఈ యాడ్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఊరికే మెగాస్టార్ అయిపోరు కదా మినిమమ్ ఉంటది అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X