అప్పటికే పెళ్లైన అమ్మాయిని వివాహమాడిన యంగ్ డైరెక్టర్.. రెండోసారైనా ఓ రేంజ్ లో వేడుక చేశారుగా!

ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. తమ మనుసుకు నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలని వివాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాథి, దగ్గుబాటి అభిరాం, బాలీవుడ్ హాట్ బ్యూటీ ముక్తి మోహన్ వారంతా ఇటీవలే పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వాళ్లు అయ్యారు. అయితే తాజాగా ఓ యంగ్ అండ్ డైనమిక్ డైరక్టర్ కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే పెళ్లయిన అమ్మాయిని ఆయన వివాహం ఆడాడు. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరు అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నారు వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కోలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రిష ఇల్లానా నయనతార సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టాడీ కుర్ర డైరెక్టర్. ఆ తర్వాత అన్బానవర్ అసరాధవన్ అడంగాధవన్ సినిమాల కూడా తెరకెక్కించి... అతిథి పాత్రల్లో కూడా నటించి మెప్పించాడు. అలాగే దబాంగ్ 3 సినిమాకు రచయితగా (తమిళంలో మాత్రమే) కూడా పని చేశారు. బగీరా, మార్క్ ఆంటోని చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే కే-13, నేర్కొండ పార్వై, నాగుపాము వంటి చిత్రాల్లో నటుడిగానూ కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్.. పెళ్లి చేసుకున్నాడు.

Director Adhik Ravichandran Maary With Actor Prabhu Daughter Aishwarya Today Check Details

అయితే అధిక్ రవిచంద్రన్ పెళ్లి చేసుకుంది మెరవరినో కాదు.. నటుడు ప్రభు కూతురు ఐశ్వర్యా ప్రభునే. డార్లింగ్, చంద్రముఖి, తూనీగా తూనీగా, మిస్టర్ ప్రేమికుడు వంటి సినిమాల్లో తండ్రి పాత్ర చేసిన ఆయన కేవలం తెలుగు, తమిళ్ లోనే కాకుండా మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేశాడు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈయనకు.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముందుగా కొడుకు పుట్టగా.. ఆయన విక్రం ప్రభు. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలు చేస్తున్నాడు. ఇక రెండో ఆమె కూతురు. ఆమె పేరే ఐశ్వర్యా ప్రభు.

Director Adhik Ravichandran Maary With Actor Prabhu Daughter Aishwarya Today Check Details

అయితే ఐశ్వర్యా ప్రభుకు గతంలోనే ఓసారి వివాహం జరిగింది. తమ దగ్గరి బంధువు అయిన కునాల్ అనే వ్యక్తితో 2009లో పెళ్లి చేశారు. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. అతి తక్కువ కాలానికే వారిద్దరూ విడాకులు తీసుకుని వేరయ్యారు. ఇక అప్పటి నుంచి ఈమె తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది. అయితే తన సోదరుడు విక్రమ్ హీరోగా చేసిన ఇరుకప్పపుట్టు సినిమాలో అధిక్ రవిచంద్రన్ డైరెక్టర్. ఇలా వీరిద్దరి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాలకు వీరి ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పించుకున్నారు. ఇలా ఈరోజు చెన్నైలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.

Director Adhik Ravichandran Maary With Actor Prabhu Daughter Aishwarya Today Check Details

ఇరుకుటుంబ సభ్యులతో పాటు వందలాది మంది బంధుమిత్రులు, స్నేహితుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లే అయినా.. అధిక్ కు మొదటి పెళ్లి కావడంతో చాలా గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. అయితే ఈ వేడుకకు హీరో విశాల్ కూడా వెళ్లాడు. అక్కడే వారితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పెడుతా.. నూతన వధూవరులకు కంగ్రాట్స్ చెప్పారు. ముఖ్యంగా నా డార్లింగ్ అధిక్, నా సోదరి ఐశ్వర్యకు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చిన విశార్.. నా సోదరిని బాగా చూసుకో అధిక్ అంటూ తెలిపాడు. అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అనేక మంది కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X