ఆర్ఎక్స్ 200.. ఈ సారి డబుల్ డోస్ అంటున్న డైరెక్టర్..?
2018లో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆర్ఎక్స్ 100. ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శకుడు అజయ్ భూపతి చాలా మంది హీరోల చుట్టూ తిరిగి చివరికి కొత్త హీరోతో చేసిన కాన్సెప్ట్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఎక్కువగా ఉపయోగపడింది.
అలాగే కథలో మెయిన్ పాయింట్ ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియెన్స్ కి సరికొత్త ఫీల్ ని కలిగించాయి. ఇక ఇప్పుడు దర్శకుడు అజయ్ భూపతి ఆ సినిమాకు సీక్వెల్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు మించి ఉండేలా ఆర్ఎక్స్ 200 గా ఆ సినిమా రానున్నట్లు టాక్ వస్తోంది. డైరెక్టర్ అజయ్ దాదాపు సీక్వెల్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం మహా సముద్రం సినిమాను సెట్స్ పైకి తేవాలని చూస్తున్నాడు. ఇప్పటికే చాలా మంది హీరోలను సంప్రదించిన అజయ్ ఒప్పించడంలో సక్సెస్ కావడం లేదు. హిట్టు సినిమా తీసినప్పటికి అతను చెప్పిన కథను చేయడానికి స్టార్స్ ముందుకు రావడం లేదు. లాక్ డౌన్ సమయంలో పలువురు హీరోలు పాజిటివ్ గా దర్శకుడికి మెస్సేజ్ పంపినట్లు తెలుస్తోంది. త్వరలోనే మహాసముద్రం సినిమాను పూర్తి చేసి ఆ తరువాత ఆర్ఎక్స్ 100 సీక్వెల్ పై దృష్టి పెట్టాలని అజయ్ ప్లాన్ చెసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











