Aditi Rao Hydari Love: సిద్దార్థ్, అదితి డేటింగ్‌కు కారణం ఆయననేనట!

టాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాధించుకున్న అతడు.. ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నాడు. 2003 లో బాయ్స్ సినిమాతో సంచలనం సృష్టించిన ఈ అందగాడు... 20 ఏళ్లుగా హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. 44 ఏళ్ల వయసు ఉన్న ఈ హీరో.. హైదరాబాద్ అమ్మాయి, అందాల తార అదితీ రావు హైదరీలు ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎక్కడ చూసిన వీరు ఇద్దరు కలిసే దర్శనం ఇస్తున్నారు.

చాలా పార్టీలు, ఫంక్షన్లలో అదితీ, సిద్దార్థ్ కలిసి వెళ్తూ మీడియాకు కనిపించగా.. నిజంగానే వీరి మద్ధ ప్రేమ ఉందని అంతా అనుకుంటున్నారు. డేటింగ్ కూడా చేస్తున్నారని పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అయితే హీరో సిద్దార్థ్ తాజాగా షేర్ చేసిన ఓ ఫొటో మరోసారి చర్చకు కారణం అయింది. ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చినట్లు అయింది. అదేంటీ అంటారా.. హీరోయిన్ అదితీ రావు హైదరీ అక్టోబర్ 28వ తేదీన తన 37వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ బర్త్ డే పార్టీకీ చాలా మంది సినీ హీరోలు, హీరోయిన్ లు కూడా వెళ్లారు. దగ్గరి మిత్రులు కూడా పార్టీలో పాల్గొన్నారు.

 Director Ajay Bhupathi Shocking Comments on Siddharth Aditi Loe Story

అయితే ఆ సందర్భంగానే హీరో సిద్దార్థ్.. అదితీ రావు హైదరితో కలిసి ఓ ఫొటో దిగాడు. దాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ అదితీకి హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పాడు. అందులో హ్యాపీ బర్త్ డే పార్టనర్ అంటూ ఆయన రాసుకొచ్చిన విషయం చూసిన వారంతా వారిద్దరూ ప్రేమలో ఉన్నారని నమ్ముతున్నారు. అయితే తాజాగా ఈ పోస్టుపై డైరెక్టర్ అజయ్ భూపతి స్పందించారు. సిద్దార్థ్ షేర్ చేసిన ఫొటోనే... డైరెక్టర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.. దీనికి కారణం నేనేనని అంతా అనుకుంటున్నారు.. అసలేం జరుగుతుందని అంటూ సరదాగా ట్వీట్ చేశారు.

 Director Ajay Bhupathi Shocking Comments on Siddharth Aditi Loe Story

ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. అయినా వారిద్దరి ప్రేమకు మీరు కారణం ఎలా అవుతారు, మీరే నిజంగా వారిని కలిపారా అంటూ కొంత మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే వారి ప్రేమకు ఆజ్యం పోసింది ఆయనేనంటూ చెప్పుకొస్తున్నారు. అసలు అజయ్ భూపతి ఇలా పోస్ట్ చేయడానికి కూడా ఓ కారణం ఉంది లెండి. అదేంటీ అనుకుంటున్నారా... హీరో సిద్దార్థ్, అదితీ రావు హైదరీలు కలిసి చేసిన మొదటి చిత్రం మహా సముద్రం. ఈ సినిమాకు దర్శకుడు అజయ్ భూపతే.

 Director Ajay Bhupathi Shocking Comments on Siddharth Aditi Loe Story

మహాసముద్రం సినిమాలో వీరిద్దరూ మొదటి సారిగా కలిసి పని చేయగా... అక్కడే వారిద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. అది కాస్తా కొంత కాలానికే ప్రేమగా మారిందని టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై మాత్రం ఇప్పటికి ఒక్కసారి కూడా అటు అదితీరావు హైదరీ కాని ఇటు సిద్దార్థ్ కానీ స్పందించలేదు. తాజాగా దర్శకుడు అజయ్ భూపతి చేసిన ట్వీట్ పైన అయినా వీరిద్దరూ స్పందిస్తారా, స్పందిస్తే ఏమంటారో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X