ప్రేమకు రెయిన్ చెక్ చిత్రం యూత్‌ను ఆకట్టుకొంటుంది.. దర్శకుడు శ్రీనివాస్
ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం "ప్రేమకు రెయిన్ చెక్". ఈ చిత్రం కొత్త కంటెంట్‌తో ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పించారనగానే ఆడియెన్స్ లో ఓ అటెన్షన్ ఈ చిత్రం పై ఏర్పడింది.
అభిలాష్ వాడడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 7 న విడుదలై యూత్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఎన్నో ప్రేమకధలను తెలుగువారు చూసుంటారు కానీ, తొలిసారి ఓ ఎడ్వెంచరెస్ లవ్ స్టొరీతో దర్శకుడు ఆకెళ్ల ఓ ఫ్రెష్ ఫీల్ ను ప్రేక్షకులకు అందించారన్న ఫీడ్ బ్యాక్ లభించింది.

నటీనటులు కొత్తవారైనా , టెక్నికల్ టీమ్ సపొర్ట్ తో ఆకెళ్ల పేరి శ్రీనివాస్ ఓ వండర్ ఫుల్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారన్న కామెంట్స్ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి వినిపించటం విశేషం.
విడుదలకు ముందే హాలీవుడ్ నిర్మాతల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావటంతో పాటు , ఇప్పుడు కామన్ ఆడియెన్స్ కూడా ఈ కంటెంట్ కనెక్ట్ కావటం పట్ల దర్శకుడిగా ఆకెళ్ల పేరి శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చెస్తున్నారు.
అభిలాష్ వాడడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం, రఘు కారుమంచి, కిరీటి దామరాజు, కల్కీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి. సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











