స్పానిష్ వెబ్ సిరీస్ లో మనవాళ్ళు

నెట్‌ఫ్లిక్స్ యొక్క ప్రసిద్ధ స్పానిష్ వెబ్ సిరీస్ మనీ హీస్ట్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. కొన్ని రోజుల క్రితమే ఐదవ సీజన్ ను ప్రకటించారు. ఇక అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది అనడంలో సందేహమే లేదు. ఇప్పటివరకు విడుదలైన సిరీస్‌లో, నాలుగు సీజన్లు అత్యంత విజయవంతమయ్యాయి. అందుకే ఐదవ సీజన్ విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సిరీస్ ను భారత్ లోకి తీసుకు రావాలని చూస్తున్నారట.

ఇందుకోసం దర్శకుడు అలెక్స్ మనీ హీస్ట్ లోని అనేక పాత్రల కోసం తన నటులను సైతం ఎంపికచేసుకున్నాడని వినికిడి. ప్రొఫెసర్ , బెర్లిన్ గా అల్వారో మోర్టే, పెడ్రో అలోన్సో పోషించారు. అయితే ఈ సారి తన వెబ్ సిరీస్ లో భారతీయ నటులను ఎంపిక చేసాడు. వారి రూపాలను బట్టి వాళ్లు తన సిరీస్ లో ఎవరిలా ఉంటారన్నది అంచనా వేశారు.

director Alex Rodrigo chose an Indian cast for Netflix series

వారిలో షారూఖ్ ఖాన్ బెర్లిన్ లేదా పలెర్మో పాత్రకు సరిగ్గా సరిపోతాడని రోడ్రిగో తెలిపాడు. దోపిడీ సమయంలో ముఠాకు నాయకత్వం వహించే బాధ్యతకు బాద్షా అయితేనే పర్ఫెక్ట్ అని తేల్చేశాడు. ఆయుష్మాన్ ఖురానా లేదా తమిళ హీరో విజయ్ ప్రొఫెసర్ పాత్రకు సరిపోతారని తెలిపాడు. ఆలాగే లోహశాస్త్రంలో నిపుణుడైన బొగోటాపాత్రను తమిళ్ స్టార్ అజిత్ పోషిస్తే అదిరిపోతుందని చెప్పాడు.

ఇక మరో తమిళ హీరో సూర్యా జీఈఓ ఛీఫ్ సువారెజ్ పాత్రకు సూట్ అవుతాడని, బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ డెన్వర్ పాత్రలో నటించిన జైమ్ లోరెంట్ కు మ్యాచ్ అవుతాడని మనసులోని ముచ్చటను బయటపెట్టాడు. మహేష్ బాబు కల్నల్ లుయిస్ టమాయో గా సెట్ అవుతాడట. ఇలా దర్శకుడు మన స్టార్స్ ను సెట్ చేసుకున్నాడు. ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ వినడానికి మాత్రం చాలా బాగుంది కదూ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X