హరి హర వీరమల్లు రిజల్ట్‌పై.. తొలిసారిగా స్పందించిన డైరెక్టర్ జ్యోతి క్రిష్ణ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ ఫిల్మ్ హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించారు. కానీ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నారు. 2000 ఏడాదిలో ప్రారంభమైన ఈ చిత్రం ఇక 2025 జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఇప్పటికే సినిమా రిజల్ట్ పై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తాజాగా దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
తొలిసారిగా పాన్ ఇండియన్ ఫిల్మ్ గా...
డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా స్థాయిలో పవన్ కళ్యాణ్ నుంచి ఈ చిత్రం తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ రీజినల్ చిత్రాల్లో మాత్రమే నటించారు. అయితే పొలికల్ గా ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ వెండితెరపై మెరిసిన తొలి చిత్రం హరి హర వీరమల్లు. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చివరికి సినిమా విడుదలై మిశ్రమ స్సందనను అందకోవడం గమనార్హం.

హరి హర వీరమల్లుపై నెగెటివ్ రెస్పాన్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా పీరియాడికల్ ఫిల్మ్ లో నటించడం విశేషం. పైగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఛార్జీ తీసుకున్న తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇది. సినిమాను పవన్ కళ్యాణ్ కూడా తనకు వీలైనంత వరకు ప్రమోట్ చేశారు. సినిమా గురించి గొప్ప మాట్లాడారు. కానీ చివరికి సినిమా విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. కొందరైతే మరి నెగెటివ్ ఓపినీయన్ ను చెప్పడం గమనార్హం. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, కథను నడిపించిన తీరు, పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ వంటి అంశాల్లో ఆశించిన మేర అవుట్ పుట్ రాలేదనే అభిప్రాయాలు వచ్చాయి.
తొలిసారిగా స్పందించిన దర్శకుడు..
తొలుత హరి హర వీరమల్లు చిత్రంపై దర్శకుడు ఏఎం జ్యోతి కృష్ణ ఆసక్తికరంగా స్పందించారు. సినిమాపై వస్తున్న టాక్ కు తన సమాధానం ఇచ్చారు. చిత్ర షూటింగ్ ఎన్నో మార్లు బ్రేక్ అవ్వడం వల్ల అనుకున్న అవుట్ పుట్ రాలేదని అన్నారు. అయితే సినిమా కథ మొత్తం కోహినూర్ పై సాగుతూనే, సినిమా మాయ బజార్ తరహాలో వినోదాన్ని కూడా అందించేలా చిత్రీకరించేందుకు ప్రయత్నించాం. కానీ షూటింగ్ కు అధిక సంఖ్యలో ఆటంకం కలగడంతో ఆ వెర్షన్ పూర్తి కాలేదని తెలిపారు.
ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్ర బృందం ఇన్నేళ్లు సినిమాను హోల్డ్ ఉండటాన్ని ప్రశ్నించారు. మరోవైపు సినిమా అవుట్ పుట్ విషయంలోనూ ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ను అంగీకరించారు. హరి హర వీరమల్లు 2లో ఆ లోటు పాట్లను సరిచేసుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయాల గ్రాస్ కు చేరువైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. మరో 80 కోట్ల రూపాయలు వసూల్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్ విలన్ గా అలరించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











