’ప్రభాస్ కు 75సార్లు కథ చెప్పా... వాళ్ల వల్లే డార్లింగ్ ను మిస్ అయ్యా‘
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను కూడా వెయిట్ చేసేలా చేస్తున్నారు. డార్లింగ్ లైనప్ కూడా చాలా హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఎప్పుడెప్పుడు ఆయా ప్రాజజెక్ట్స్ ల్లో ప్రభాస్ ను వెండితెరపై చూస్తామనే ఆలోచనకే ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చివరిగా డార్లింగ్ 'సలార్', 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. రెండు భారీ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. బాక్సాఫీస్ కూడా షేక్ అయ్యింది.
నెక్ట్స్ ప్రభాస్ 'రాజా సాబ్', 'ఫౌజీ' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత 'స్పిరిట్', 'సలార్ 2', కల్కి2 చిత్రాల్లో నటించనున్నారు. వేల కోట్ల ప్రాజెక్టులతో డార్లింగ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ కోసం దర్శకనిర్మాతలు ఎంతలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. అయితే డార్లింగ్ ఇప్పుడంటే నేషనల్ స్టార్ గా ఎదిగి సమయం ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. కానీ కెరీర్ ప్రారంభంలో మాత్రం అందరికీ అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నించేవాడంట.. ఈ క్రమంలోనే ఓ దర్శకుడు ఏకంగా 75 సార్లు కథ చెప్పి మరీ డార్లింగ్ మిస్ చేసుకున్నాడంట.

ఆయన మరెవరో కాదు.. దర్శకుడు అమ్మ రాజశేఖర్ కావడం విశేషం. 90లో ఈయన మంచి సినిమాలనే డైరెక్ట్ చేశారు. తమిళం, తెలుగు, కన్నడ చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన డైరెక్షన్ కు, దాదాపు ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేక రెండు దశాబ్దాలు దాటుతోంది. ఆయన నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. కానీ పలు ఇంటర్వ్యూల్లో మెరుస్తూ తన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటారు.
ఈ క్రమంలో తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తో చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యిందో చెప్పుకొచ్చారు. అమ్మ రాజశేఖర్ డార్లింగ్ తో సినిమా చేయాలని ఎంతో ప్రయత్నించినా కుదరలేదన్నారు. అడ్వాన్స్ తీసుకొని మరీ చేయలేకపోయాయని చెప్పుకొచ్చారు. తను రాసుకున్న కథను ప్రభాస్ కు ఏకంగా 75 సార్లు వినిపించారంట. ప్రభాస్ కు కూడా ఓకే అన్నారంట.. కానీ డార్లింగ్ తో సినిమా చేద్దామనుకునే సమయానికి వైవీఎస్ చౌదరి ప్రాజెక్ట్ లో భాగమవడంతో డేట్స్ దొరకక కుదరలేదన్నారు. లేదంటే మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేవాడినన్నారు.
అలాగే వెంకటేశ్ గారితోనూ ఓ సినిమా మిస్ అయ్యిందన్నారు. అన్నీ ఓకే అవుతున్న సమయానికే యాంకర్ ఓంకార్ వచ్చి ఢీషోకు రావాలని కోరడం, పెద్ద అమౌంట్ తో చెక్కు ఇవ్వడం.. కాస్తా గ్యాప్ రావడంతో వెంకటేశ్ తో సినిమా కూడా అలా మిస్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇక అమ్మ రాజశేఖర్ డైరెక్టర్ గానూ, స్క్రీన్ రైటర్ గా చాలా సినిమాలకు పనిచేశారు. ఎక్కువగా తమిళ చిత్రాలకు వర్క్ చేశారు.


Click it and Unblock the Notifications











