తమన్నాతో గోడవపై మొదటిసారి స్పందించిన అనిల్ రావిపూడి.. షూటింగ్ లో అలా అనడం వల్లే అంటూ..

సినిమా ప్రపంచంలో సినీ తారల మధ్య గొడవలు జరుగుతూ ఉండటం సర్వసాధారణం అనే చెప్పాలి. ముఖ్యంగా దర్శకులు ఇతర నటీనటులు కూడా ఏదో ఒక విషయంలో బేధాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది టెక్నీషియన్స్ అయితే షూటింగ్ మధ్యలోనే కూడా గొడవల కారణంగా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే రీసెంట్ గా గ్లామర్ హీరోయిన్ తమన్నా భాటియా దర్శకుడు అనిల్ రావిపూడి గొడవపడ్డాడు అని అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో దర్శకుడు మొదటిసారి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు. ఒక విధంగా ఆ గొడవ జరిగింది నిజమే అని తమన్నా ప్రమోషన్స్ లో ఎందుకు లేదనే విషయంపై కూడా స్పందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వరుస విజయాలు

వరుస విజయాలు

దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు అందుకుంటున్నాడు అంతే కాకుండా అతనితో సినిమాలు చేసేందుకు అగ్ర హీరోలు అందరూ కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇంతవరకు ఎక్కువగా కామెడీ సినిమాలతోనే మంచి క్రేజ్ అందుకున్న అనిల్ రావిపూడి ఇటీవల F3 సినిమాతో మరోసారి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదే తరహాలో..

ఇదే తరహాలో..

వెంకటేశ్ వరుణ్ తేజ్ ఇద్దరితో అనిల్ రావిపూడి క్రియేట్ చేసిన F3 కామెడీ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాదించింది. ఈ సినిమా F2 సినిమాకు ఫ్రాంచైజ్ గా వచ్చిన విషయం తెలిసిందే. తరహాలో భవిష్యత్తులో కూడా మరిన్ని సినిమాలు వస్తాయని కూడా అని అనిల్ వివరణ ఇచ్చాడు. ప్రస్తుతానికైతే ఎఫ్ 4 స్టోరీలైన్ అనుకుంటున్నట్లు చెప్పిన అనిల్ రావిపూడి ఆ ప్రాజెక్టు రావడానికి మాత్రం ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది అని అన్నాడు.

తమన్నాతో గొడవ

తమన్నాతో గొడవ

అయితే అనిల్ రావిపూడికి అలాగే హీరోయిన్ తమన్నా భాటియాకి మధ్యలో కాస్త గొడవ జరిగింది అనే ఇద్దరు కూడా చాలా సీరియస్ గా మాట్లాడుకున్నారని ఇటీవల అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ గొడవ కారణంగానే తమన్నా సినిమా ప్రమోషన్ కూడా రాలేదు అని మరికొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక విషయాలపై కూడా సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో అందరు నిజమే అని అనుకున్నారు.

నిజమే..కానీ..

నిజమే..కానీ..

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మొదటిసారి తమన్నా తో ఏర్పడిన విభేదాల గురించి తెలియ జేశాడు. ఒక విధంగా ఇద్దరి మధ్యలో వాతావరణం వేడెక్కిన విషయం నిజమే అని అయితే అది ఎక్కువ రోజులు కొనసాగ లేదు అని దర్శకుడు వివరణ ఇచ్చాడు. కొంత గొడవ జరిగిన తర్వాత మళ్లీ తనే వెళ్ళి మాట్లాడినట్లు కూడా తెలియజేయడం విశేషం.

అలా జరిగింది

అలా జరిగింది

F3 సినిమా షూటింగ్ లో ఒక రోజు అనుకోకుండా 6 గంటల తర్వాత ఫ్యాకప్ చెప్పకుండా వర్క్ చేయాల్సి వచ్చింది.. సాధారణంగా ఆర్టిస్టులు 6 గంటల వరకు ఉంటా. అది రూల్ అయితే మిగతా పనుల వలన తమన్నా ఆరు గంటల తర్వాత షూటింగ్ చేయలేనని చెప్పింది. కానీ అప్పటికే మిగతావారి కాల్షీట్స్ అన్నీ కూడా రెడీ అయ్యాయి. మళ్ళీ ఆలస్యమైతే ఎవరు దొరకరు అనే తమన్నాను కూడా ఆ రోజు షూటింగ్ లో ఉండాలి అని చెప్పారట. కానీ తమన్నా తనకు కుదరదు అని చెప్పడంతో అలా క్లాష్ వచ్చినట్లు అనిల్ తెలిపారు.

ప్రమోషన్స్ కు రాకపోవడానికి కారణం..

ప్రమోషన్స్ కు రాకపోవడానికి కారణం..

అయినా ఇదేమీ పెద్ద గొడవ కాదు అని సాధారణంగా ఎంతోమందితో పని చేస్తున్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అని అదే తరహాలో ఒక రెండు రోజులు తమన్నాతో మాట్లాడకుండా ఉండడం తో వాతావరణం వేడెక్కింది అని అనిల్ తెలియజేశాడు. ఇక మళ్ళీ నేనే వెళ్ళి తనతో మాట్లాడి ఆ మేటర్ అంతటితో క్లోజ్ చేసాను అని తమన్నా F3 సినిమా ప్రమోషన్ లో పాల్గొనకపోవడానికి ప్రధాన కారణం ఆమె మిగతా షూటింగ్స్ వలన బిజీగా ఉన్నట్లుగా ఈ దర్శకుడు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X