ఖరీదైన విల్లా కొనేసిన F2 డైరెక్టర్ అనిల్ రావిపూడి.. దాని విలువ ఎన్ని కోట్లంటే!
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. పదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ దర్శకుడిగా రైటర్ గా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న అనిల్ రావిపూడి ఫైనల్ గా పటాస్ సినిమాతో తన కలను నెరవేర్చుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ అయిన తరువాత అనిల్ ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ఇటీవల దర్శకుడు హైదరాబాద్ లో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు టాక్ వస్తోంది.

రైటర్ గా వర్క్ చేసి..
పవన్ కళ్యాణ్ తమ్ముడు డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ బంధువైన అనిల్ 2004లో బీటెక్ అయిపోగానే ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. కొన్నాళ్లపాటు అలా కొనసాగుతూ వచ్చిన అనిల్ గోపిచంద్ హీరోగా చేసిన శౌర్యం సినిమాతో డైలాగ్ రైటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు. మిస్టర్ పర్ఫెప్ట్, కందిరీగ, సుడిగాడు, ఆగడు, పండగ చేసుకో వరకు స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పని చేసుకుంటూ వచ్చాడు.

వరుసగా బాక్సాఫీస్ హిట్స్..
ఇక దర్శకుడిగా మొదటి సినిమా పటాస్ తోనే తానేంటో నీరూపించుకున్నాడు అనిల్. స్క్రిప్ట్ పేపర్ చూడకుండా ప్రతి సీన్ ను డైరెక్ట్ చేసినట్లు ఆ సినిమాకు పని చేసినవాళ్ళు చెబుతుంటారు. ఇక సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2 అనంతరం ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసి సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టాడు.

దిల్ రాజు ప్రొడక్షన్ లోనే..
మొదటి సినిమా తప్పితే మిగతా సినిమాలన్నిటిని కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే చేసిన అనిల్ నిర్మాతకు మాత్రం మంచి లాభాలను అందిస్తున్నాడు. ఇక నెక్స్ట్ ఈ ఈ దర్శకుడు F3 సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఆ సినిమా ఆగస్ట్ 27న విడుదల కాబోతోంది.

ఖరీదైన విల్లా..
ఇక అనిల్ రావిపూడి ఇటీవల హైదరాబాద్ లో ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా కొనసాగుతున్న అనిల్ ఒక్కో సినిమాకు 10కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఇక హైదరాబాద్. లోని కొండాపుర్ ఏరియాలో 12కోట్ల విలువైన విల్లాను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆ ఇంట్లోకు ఫ్యామిలీతో కలిసి షిఫ్ట్ కానున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











