డైరెక్టర్ అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్.. ప్లాన్ మొత్తం క్యాన్సిల్
కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు మరింత విషమంగా మారుతోంది. గత ఏడాదితోనే ముగిసిందని అనుకున్న కరోనా ఇప్పుడు మరింత డోస్ పెంచుతోంది. ఇక నిన్నటి వరకు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న వారు ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక కొంతమంది దర్శకులు కూడా కరోనా భారిన పడుతున్నారు. అనిల్ రావిపూడికి కూడా పాజిటివ్ వచ్చింది.
ఇటీవల F3 సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ను మొదలు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మైసూర్ లో సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ప్లాన్ అంతా కూడా రెడీ అయ్యిందని అనుకున్న సమయానికి అనిల్ కు కరోనా సోకడం అందరిని షాక్ కు గురి చేసింది. పాజిటివ్ అని రాగానే వెంటనే క్వారంటైన్ లోకి వెళ్లిన అనిల్ చిత్ర యూనిట్ సబ్యులకు కూడా వెంటనే పరీక్షలు చేయాల్సిందిగా హెచ్చరించారు.

దాదాపు అందరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి F3 సినిమాలో వెంకటేష్ వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. F2 సినిమాకు ఫ్రాంచైజ్ గా వస్తున్న ఈ సినిమా డబ్బు కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా అనంతరం అనిల్ మహేష్ బాబుతో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. కానీ ఇంకా ఆ కాంబో ఫైనల్ కాలేదు. ఇక F3 సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











